BigTV English

Mahesh Babu mass look: మహేష్ ని పూర్తి స్థాయి మాస్ గా చూడాలనుకుంటున్న ఫ్యాన్స్

Mahesh Babu mass look: మహేష్ ని పూర్తి స్థాయి మాస్ గా చూడాలనుకుంటున్న ఫ్యాన్స్

Mahesh Babu latest news(Today tollywood news): ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. క్లాస్, మాస్ హీరోగా చేస్తూ మధ్యలో కొన్ని ప్రయోగాలు సైతం చేశాడు మహేష్ బాబు. అయితే ఆ ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో మహేష్ ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకి కలిసొచ్చే జానర్ లోనే సినిమాలు చేస్తున్నాడు. ఈ నెల 9న ప్రిన్స్ మహేష్ పుట్టిన రోజు. రాజమౌళి దర్శకుడిగా మహేష్ బాబు నటిస్తున్న మూవీ గురించి కొంతకాలంగా చాలా కథనాలే వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ఫలానా హీరోయిన్ అని, ఫలానా నటుడు అంటూ గాసిప్ వార్తలే వచ్చాయి. దానిపై అటు రాజమౌళి గానీ ఇటు మహేష్ బాబు గానీ క్లారిటీ ఇవ్వలేదు.


బర్త్ డే రోజు అప్ డేట్ ఇస్తారా?

పుట్టినరోజు తప్పనిసరిగా ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తమ అభిమాన హీరో మూవీ విషయంలో ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహంతోనే ఉన్నారు. ఇప్పటిదాకా వరుస గా డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబును వెండి తెరపై చూసుకోవడానికి మరో మూడోళ్లు పట్టొచ్చని..రాజమౌళి టేకింగ్స్ తెలిసిన వాళ్లు అనుకుంటున్నారు. రాజమౌళి పాన్ ఇండియా మూవీలను పరిశీలిస్తే విషయం అర్థం అవుతుంది. ఆ ఒక్క విషయంలో తప్ప ఫ్యాన్స్ కు అంతకు మించి ఆందోళన ఏమీ లేదు. అయితే మహేష్ బాబుకు క్లాస్ చిత్రాల కన్నా మాస్ చిత్రాలే మంచి పేరు తెచ్చిపెట్టాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అయితే ఆ మూవీ తర్వాత పూర్తి స్థాయి మాస్ యాంగిల్ ఉన్న సినిమాలో తమ అభిమాన హీరోను చూసుకోవాలని అనుకుంటున్నారట ఫ్యాన్స్. పోకిరి మూవీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ క్లాస్ టచ్ తో వచ్చిన మాస్ సినిమాలే అయినా..మళ్లీ మహేష్ బాబు ఆ తరహా క్యారెక్టర్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


మాస్ హీరోగా నటించాలని..

రాజమౌళి సినిమాలలో హీరోలకు మాస్ ఇమేజ్ ఎలానూ ఉంటుంది. అయితే రాజమౌళి తమ అభిమాన హీరోని మాస్ గా చూపిస్తారా లేక క్లాస్ హీరోగా చూపిస్తారా అనేది అభిమానులకు అర్థ: కావడం లేదు. సినిమాపై ఏదో ఒక అప్ డేట్ వస్తే గానీ క్లారిటీ రాదు. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలనూ ఎంతో గొప్పగా చూపించారు రాజమౌళి. ఆ మూవీతో ఈ ఇద్దరు హీరోలకూ గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ వచ్చింది. ఇక ప్రభాస్ సంగతి కూడా చెప్పనక్కర్లేదు బాహుబలితోనే ఆయన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా గ్లోబల్ హీరో ఇమేజ్ లో పూర్తి మాస్ హీరోగా కనిపించాలని అభిమానులు తహతహలాడుతున్నారు.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×