ప్రేమమ్ మూవీలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆమె క్యూట్ లుక్స్ చూసి ఎందరో అభిమానులు ఆమెకు దగ్గరయ్యారు. ఈ బ్యూటీ వాస్తవానికి మలయాళీ అయనా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మొదట్లో పద్ధతిగా ఫ్యామిలీ హీరోయిన్ గా కనిపించి కనువిందు చేసింది. అయితే అవకాశాలు కొద్దిగా తగ్గడంతో ఇక లాభం లేదని టిల్లు స్క్వేర్ మూవీతో తాను కూడా గ్లామర్ పాత్రలు చేయగలనని నిరూపించింది. ఇక ఆ సినిమా కీలక విజయంలో అనుపమ నటనకు, ఆమె అందాలకు ప్రేక్షకాభిమానులు ఫిదా అయ్యారు. అయితే అనుపమకు బీ గ్రేడ్ హీరోలతోనే ఇప్పటిదాకా అవకాశాలు దక్కాయి.
ఆ అవకాశం దక్కలేదు
బడా హీరోలతో మాత్రం దక్కలేదు. అయితే టిల్లూ స్క్యేర్ లో హీరో జొన్నలగడ్డ సిద్దు తో రొమాన్స్ లో రెచ్చిపోయింది. లిప్ టూ లిప్ కిస్ తో అదరగొట్టేసింది. అనుపమలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్ లో అనుపమ లిప్ లాక్ సీన్ చూసి ఓఅభిమాని అప్పట్లో చాలా హర్ట్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అనుపమను ట్రోల్ చేస్తూ..ఇప్పటిదాకా నీ మీద ఉన్న అభిమానం ఈ మూవీతో ఒక్కసారిగా పోయింది. నీ మీద చాలా హోప్స్ పెట్టుకుని నీకు అభిమానిగా మారిపోయాను. నువ్వేదో ఇండస్ట్రీకి దొరికిన సావిత్రివో, సౌందర్యవో అనుకున్నాను. అయితే ఆ అభిప్రాయం తప్పని ఈ మూవీలో నువ్వు చేసిన స్కిన్ షో, లిప్ లాక్ సన్నివేశాలు నన్ను తీవ్రంగా హర్ట్ చేశాయి. అంటూ పోస్ట్ పెట్టి మరీ ట్రోల్ చేశాడు.
యూత్ ఆరాధ్య దేవతగా..
మూవీ వచ్చాక మాత్రం యూత్ చాలా మంది అనుపమ బోల్డ్ క్యారెక్టర్ లో ఫస్ట్ టైమ్ బాగా మెప్పించిందని..నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయవలసి ఉంటుందని అంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో యూత్ గుండెల్లో ఆరాధ్య దేవతగా మారిపోయిన అనుపమ చిన్నప్పటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వావ్ ఇంత క్యూట్ గా ఉందో చిన్నప్పుడు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. చిన్నప్పుడే హీరోయిన్ కళ కనిపిస్తోందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే..నాటి ఆ బుల్లే నేటి లిల్లీ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. టిల్లు స్క్యేర్ మూవీలో అనుపమ పరమేవ్వరన్ పేరు లిల్లీ.