BigTV English
Advertisement

CM Chandrababu : సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్

CM Chandrababu : సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్

CM Chandrababu : ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. గత వైసీపీ సర్కారులో టీడీపీ అగ్రనేతలపై అవాకులు చెవాకులు పేలిన చోటా మోటా నాయకులు ఇప్పుడెందుకు అరెస్ట్ అవుతున్నారు. అప్పటి ప్రతిపక్ష నేతలపై మాటల తూటాలు పేలిన ఎఫెక్ట్ ప్రస్తుతం కనిపిస్తోందా. నాడు ఏకంగా టీడీపీ అధినేత ఇంటిపై దాడి జరిగిన ఘటనలో ఎవరి పాత్ర ఎంత వరకు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిపైనా  వైసీపీ మూల్యం చెల్లించుకుంటుందా. వీటన్నింటికీ సమాధానాలు అవుననే అంటున్నాయి ఏపీలోని రాజకీయ వర్గాలు.


ఇప్పుడు చంద్రబాబు చాలా పవర్ ఫుల్…

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు. దేశంలోనూ తెలుగుదేశం అధినేతగా, ఏపీ సీఎంగా చంద్రబాబు చాలా పవర్ ఫుల్’గా మారారు. ఒకదశలో మోదీ సర్కార్ నడవాలంటే ఎన్టీఏలో మిత్రపక్షమైన టీడీపీ కూటమి సపోర్ట్ తప్పనిసరి కావాల్సిందే. ఇంతటి శక్తిమంతమైన నేత, గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపైనా తన పార్టీపైనా జరిగిన తప్పుడు పనులను సహిస్తారా అంటే సహించడు అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


వైసీపీకి కష్టకాలమే…

అందుకే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలను, అక్కడి నేతలను బాబు చట్టానికి పని కల్పించినట్లు తెలుస్తోంది. ఫలితంగానే గత సర్కారులో ఆనాటి సీఎం తర్వాత ఆ స్థాయి పెద్ద మనిషిగా, ప్రభుత్వానికే పెద్ద దిక్కుగా కొనసాగిన సజ్జల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు ఇబ్బందులను, కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు తీవ్ర స్థాయి విభేదాలున్నాయి.

మరోవైపు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను పోలీసులు ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో ప్రవేశపెట్టారు.  ఇలా వైసీపీ నేతలను సీఎం లక్ష్యంగా చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు సాగుతున్నాయి.

ఒక దశలో వైఎస్ జగన్ పైనా చంద్రబాబు ఫోకస్ పెడతారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆ పార్టీ పరిస్థితి ఏంటని అంతా భావిస్తున్నారు. అదే జరిగితే వైసీపీకి దిశ నిర్దేశం చేసేవారే కరువు అవుతారు. ఫలితంగా ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నది బాబు ప్లాన్ అని అంటున్నారు.

ఇప్పట్లో కాంగ్రెస్ ఉనికి లేనట్లే…

ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను కలిపి ఏలిన హస్తం పార్టీ ప్రస్తుతానికి ఆంధ్ర రాజకీయాల్లో బలం లేక వెలవెలబోతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ కారణంగా ఆ పార్టీకి ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ లెక్కన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే పైచేయి కావాలనేది టీడీపీ ప్లాన్ అని సమాచారం.

బాబు నేషనల్ పాలిటిక్స్…

ఇక చంద్రబాబు అంత సీనియర్ నాయకుడు దేశ రాజకీయాల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రధాని మోదీ కూడా చంద్రబాబు కంటే జూనియరే. బాబు సీఎం పీఠం ఎక్కిన రోజుల్లో వీళ్లంతా ఎక్కడో ఉన్నారు.

ఇక చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ లాంటి బడా నేతల సపోర్ట్ ఉండనే ఉంది. ఒకప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గానూ పనిచేశారు. ఆ పరిచాయాలన్నీ ఇవాళ చంద్రబాబుకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఇవన్నీ వెరసి జగన్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు కల్పించనున్నాయట. ప్రస్తుతం చిన్న చిన్న నేతలను వివిధ కేసుల్లో అరెస్టు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే వైసీపీకి గట్టి హెచ్చరికలు అందాయి.  ఇక త్వరలోనే చంద్రబాబు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు.

చంద్రబాబుకు లోకేశ్, జగన్ కు ఎవరు …

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ వారసుడిగా లోకేశ్ ఉన్నారు. మరోవైపు అవసరమైతే పవన్ కల్యాణ్ కూడా ఇదే కోవలోకి రాగలరు. కానీ వైసీపీని ఒంటిచేత్తో నడిపిస్తున్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కేసుల్లో ఇరుక్కుపోతే, ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వచ్చేసారి కూడా బీజేపీ, జనసేనతో జట్టుకట్టి మరోసారి అధికారంలోకి రావాలన్నదే తెలుగుదేశం పార్టీ అసలు సిసలైన వ్యూహం అన్నట్లు అంతా భావించడం కొసమెరుపు.

Also Read : దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×