BigTV English

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

తిరుమల అంశంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆయన్ను దర్శనానికి వెళ్లొద్దని తాము ఎప్పుడూ అనలేదని, తనకు నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ఒకవేళ తాము నోటీసులు ఇచ్చి ఉంటే వాటిని చూపించాలన్నారు.


కోట్లాది భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని, తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో శ్రీవారిని కొలుస్తారని చంద్రబాబు అన్నారు.

స్వామి వారు ఉండటం మనందరి అదృష్టం…


ఏడు కొండలస్వామి పవిత్రతను కాపాడటం కోసం, టీటీడీ బోర్డు రక్షణ కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆలయ సాంప్రదాయాలను, దేవుడి ఆచారాలను అందరూ గౌరవించాలని, తిరుమల లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉండటం తెలుగువారి అదృష్టమని చంద్రబాబు అన్నారు.

దేవుడి ఆచారాల కంటే మనిషి గొప్పేం కాదన్న సీఎం, గతంలో జగన్ నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారని గుర్తు చేశారు. కల్తీ జరిగిందని ఈఓ పదే పదే చెప్పాడని, ఏఆర్ కంపెనీకి చెందిన 4 ట్యాంకర్లు వాడారన్నారు. పదే పదే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు వాటిని టెస్టింగ్ కోసం పంపించారని, ఎన్డీడీబీ రిపోర్టును చూపించారు.

మళ్లీ మళ్లీ అదే రిపీట్…

చెప్పిన అబద్ధాన్నే జగన్ మళ్లీ మళ్లీ చెబుతున్నారని, అసలు రాజకీయాల్లో ఉండే అర్హత మీకు ఉందా అని నిలదీశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని మండిపడ్డారు. తిరుమలకు వెళ్లేందుకు ఇష్టం లేదని, ఒకవేళ పోతే సంతకం పెట్టాల్సి వస్తుందన్నారు.

ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వీల్లేదు. నేనొక చట్టం తీసుకొస్తున్నాను. ఏ మతమైనా సరే అందులో వాళ్లే పని చేసేలా చేస్తామన్నారు. దళితులను రానివ్వరా అన్న అంశంపైనా ఆయన ఫైర్ అయ్యారు. అలా అని మీకు ఎవరు చెప్పారని నిలదీశారు. దళితులు ఆలయాల్లోకి వెళ్లడం లేదా, కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చెప్పిన తప్పే చేప్తా ఉంటాడని, దేవుడి భక్తుడిగా చెప్తున్నా, ఈ విషయంలో తాను బాధపడుతున్నట్లు చెప్పారు.

ఇష్టం లేకపోతే వెళ్లకండి…

వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఆ ఘీ అయితే వాడారు. కానీ ఎక్కడ వాడారనేది ఇంకొక విషయమన్నారు. పరీక్షల్లో కల్తీ తేలింది కాబట్టే దాని వాడకాన్ని ఆపేశారన్నారు.
అందుకే తాము తిరుమలలో వరల్డ్ క్లాస్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీన్ని బాధ్యత ట్రస్టీగా మనందరిదన్నారు.  కొండ మీద ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తా అంటే కుదరదని, ఇష్టం లేకపోతే వెళ్లకండి, ఇష్టం ఉంటే వెళ్లండి కానీ రూల్స్ మాత్రం పాటించి తీరాల్సిందేనన్నారు.

ఒకాయన అయితే అడ్వకేట్ పంది మాంసం బంగారం. నెయ్యి రాగి. బంగారం తీసుకొచ్చి రాగిలో కలపుతారు అంటారు. కనీసం మీరు ఖండించారా మాజీ ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నించారు. మీ వాళ్లు ఏం మాట్లాడినా భరించాల్నా, ఎట్టిపరిస్థితుల్లో టీటీడీ అపవిత్రం కాకుండా మేం చూసుకుంటాం. ఈ దేశం సెక్యులర్ గా ఉంటుందని, మతసామరస్యం కాపాడటం కోసం తప్ప రెచ్చగొట్టడం కోసం కాదని చంద్రబాబు హితవు పలికారు.

Also Read : ఇంట్లో నేను బైబిల్ చదువుతా.. బయట మాత్రం..: జగన్

ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే ఆలయాల సంప్రదాయాలను, చట్టాలను గౌరవించాలి. విచ్చలవిడితనంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. రాత్రి కాదు పగలే బైబిల్ చదువుకోవచ్చు. అది మీ రైట్. కానీ తిరుమలలో డిక్లరేషన్ ఎందుకివ్వవు అంటున్నాం. వెంకటేశ్వర స్వామిని వ్యాపారానికి, పైరవీలకు ఉపయోగించడం తప్పు. అధికార దుర్వినియోగం జరిగింది. దాన్ని ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

ఇలాంటి పాలిటీషన్స్ ఉన్నారు కాబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే నేరాలు, ఘోరాలు, క్రూరాలు ఇవన్నీ ఉంటాయి. తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం అంటే అది రైట్ అయిపోదు. అది చేయొద్దని కోరుతున్నట్లు చెప్పారు. ఏదున్నా సిట్ చూసుకుంటుందని, ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. త్వరలోనే కీలకమైన మీటింగ్ పెట్టి ఆలయ పవితత్రను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×