BigTV English

White Paper on Ap Liquor: మద్యం కుంభకోణం జరిగింది.. CBCID ఆధ్వర్యంలో ఎంక్వైరీకి సీఎం ఆదేశం

White Paper on Ap Liquor: మద్యం కుంభకోణం జరిగింది.. CBCID ఆధ్వర్యంలో ఎంక్వైరీకి సీఎం ఆదేశం
Advertisement

CM Chandrababu White Paper Released on Prohibition of Alcohol: ఏపీలో మద్యపాన నిషేధంపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం కల్తీ లిక్కర్ ను అమ్మి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. 75 శాతం మద్యం రేట్లను పెంచి ప్రజల సొమ్మును దండుకుందని విమర్శించారు. లిక్కర్ ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ వెళ్తే తాగేవారు తగ్గుతారని కుంటిసాకులు చెప్పిందన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లకే లిక్కర్ ను పరిమితం చేస్తామని చెప్పిన వైసీపీకి.. మద్యపాన నిషేధంపై కమిట్ మెంట్ లేదని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు.


4380 షాపులను 2934కు తగ్గించినట్లే తగ్గించి.. వాటిని మళ్లీ 3392కు పెంచారని విమర్శించారు. 2014-19 వరకూ 31 బ్రాండ్లకు చెందిన 180 ఎంఎల్ బాటిల్ మద్యాన్ని రూ.50 నుంచి రూ.70కి అమ్మారని వివరించారు. 2019-24 మధ్య 2 బ్రాండ్లను తగ్గించి 8454 కేసులను అమ్మినట్లు తెలిపారు. పేదవాడికి అమ్మే లిక్కర్ రేట్లను పెంచి 99.9 శాతం ఆ బ్రాండే లేకుండా చేశారని ఆరోపించారు. 2019-24 మధ్య వైసీపీ నేతల కనుసన్నల్లో మద్యం సరఫరా జరిగిందని, టాప్ 5 బ్రాండ్స్ సేల్స్ గణనీయంగా తగ్గాయని తెలిపారు. లిక్కర్ పై వచ్చే ఆదాయమంతా వైసీపీ వాళ్ల జేబుల్లోకి వెళ్లడంతోనే.. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందన్నారు.

మద్యం సరఫరా చేసే పెద్ద కంపెనీలకు బకాయిలు చెల్లించకుండా వేధించారని ఆరోపించారు. అమ్మకాల్లో రూ.99 వేల కోట్లు నగదు రూపంలోనే వచ్చిందని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే.. ఏపీలో లిక్కర్ రేట్లను గణనీయంగా పెంచారన్నారు. దేశమంతా దొరికే లిక్కర్ ఏపీలో దొరక్కుండా చేశారన్నారు. వైసీపీ ఏ బ్రాండ్ అమ్మితే.. ఆ బ్రాండ్ మద్యాన్నే తాగాల్సిన పరిస్థితి ఉందన్నారు. పగలంతా కష్టపడి.. సాయంత్రం కాస్త మద్యం తాగి అలసట తీర్చుకునే పేదవాడి జేబుకే చిల్లుపెట్టిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు.


Also Read : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం

NCCB డేటా ప్రకారం.. 2018తో పోలిస్తే.. 2022లో ఆల్కహాల్, డ్రగ్స్ కు అడిక్టైన వారి సంఖ్య 100 శాతం పెరిగిందని సీఎం వివరించారు. 2019-21 మధ్య భర్తల నుంచి ఎమోషనల్, ఫిజికల్, సెక్సువల్ వయోలెన్స్ ఎదుర్కొన్న మహిళల సంఖ్య 76.40 శాతానికి పెరిగిందన్నారు. ముఖ్యంగా 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు వేధింపులను ఎదుర్కొన్నారని తెలిపారు. 2019తో పోలిస్తే.. 2023కి లివర్ వ్యాధిగ్రస్తులు 52 శాతం, కిడ్నీ వ్యాధి గ్రస్తులు 54 శాతానికి పెరిగారని తెలిపారు. గుంటూరు జీజీహెచ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ లో ఉన్నవారి సంఖ్య 343 నుంచి 4,913కి చేరిందన్నారు. దేశచరిత్రలోనే మద్యపాన నిషేధంపై ఇలాంటి మోసం ఎక్కడా జరగలేదన్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసేసి.. లోకల్ బ్రాండ్స్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆల్కహాల్ అండ్ డీ అడిక్షన్ సెంటర్లను పెట్టి.. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టంగా వివరించారు. దీనిపై CBCID ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈడీకి రిఫర్ చేస్తామని తెలిపారు. ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయని, భారీగా లావాదేవీలు ఉండటంతో.. మద్యం కుంభకోణంపై మరింత లోతుగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు.

Related News

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Jagan: జగన్ ఇరుక్కుపోయారా? ఫారెన్ టూర్‌ చిక్కులు.. రంగంలోకి సీబీఐ, ఇప్పుడెలా?

PM Modi: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

Tirumala: తిరుమల కొండపై సీఎంఓ పెత్తనమా? బదిలీ వెనుక కారణం ఇదేనా.!

AP Excise Suraksha App: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై నకిలీ మద్యానికి చెక్

Modi To Kurnool: ఏపీకి రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు.. కర్నూలు పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్

Big Stories

×