E-Paper
Advertisement

AP Investments: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్‌లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!

AP Investments: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్‌లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!
Advertisement

AP Investments: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారిని సీఎం కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, ఆర్‌ అండ్‌ డీ (R&D) కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు.

Advertisement

2025 దావోస్ పర్యటన ద్వారా ఏపీకి సుమారు రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని భారత రాయబారి మృదుల్ కుమార్ కొనియాడారు.లిచ్టెన్ స్టైన్ దేశంలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రగతిని రాయబారి సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయి. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరులకొరతతో ఉన్నాయి. భారత దేశం యువశక్తితో సిద్దంగా ఉంది. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుంది. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉంది. ఫిబ్రవరిలో భారతదేశంలో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతాను. ప్రకృతి సేద్యంలో మేం దేశంలో టాప్ లో ఉన్నాం.” అని అన్నారు.

Advertisement

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… “స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి మీరు సహకరించగలరు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలి. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్దంగా ఉంది. యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నాం. 100 కేజీల బరువు మోసే డ్రొన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి… వాటిని కనెక్ట్ చేస్తాము. బీ టు బీ ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దాం.” అని అన్నారు.

Read Also: చావు అంచున ఉండి టార్చ్‌లైట్‌తో పిలిచాడు: నోయిడా టెక్కీ మృతిలో సంచ‌ల‌న‌ నిజాలు!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×