CM Chandrababu: ఏపీలో అసలేం జరుగుతోంది? ఎన్నికల్లో వైసీపీని ప్రజలు దూరంగా పెట్టారు. ఇంతకీ జగన్‌కు సీఎం చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా? మీడియా ముందు ఒకటే రీసౌండ్ చేసిన ఆ పార్టీ నేతలకు కౌంటరిచ్చే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
గడిచిన ఐదేళ్లు జగన్ సహా ఆ పార్టీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా రాజకీయాలు చేశారు. రాజకీయంగా వారు పెట్టిన చిత్ర హింసలు అన్నీఇన్నీకావు. వాటిని భరిస్తూ వచ్చారు చంద్రబాబు.
చాలా విషయాలను బయట పెట్టలేదు.. తన మనసులోనే ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివేంజ్ తీర్చుకోవాలని నేతలు, కేడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా ఏమాత్రం నోరెత్తలేదు.
ఏది చేసినా చట్ట ప్రకారమే చేద్దామని కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. రీవేంజ్ తీర్చుకుంటే వారికీ-మనకు తేడా లేకుండా పోతుందని చెబుతున్నారు.
ALSO READ: పెద్ద ప్లాన్ వేసిన వైసీపీ.. జనంలోకి జగన్.. అసలు కారణం అదేనా?
ఇక అసలు విషయానికొద్దాం. అమరావతిలో చంద్రబాబు ఉండరని, సొంత ఇల్లు లేదని పదేపదే విమర్శలు గుప్పించారు వైసీపీ నేతలు. ఈ విషయంలో సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారు సీఎం చంద్రబాబు.
అమరావతిలో వచ్చే ఏడాదిలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నారట ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణం జరగనుంది. అప్పుడే సొంత ఇంటిని నిర్మించాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల మాట. లేటెస్ట్‌గా సీఎం చంద్రబాబు బుధవారం మీడియా చిట్ చాట్‌లో కొన్ని విషయాలు ప్రస్తావించారు.
కొద్దిరోజుల కిందట చంద్రబాబు ఫ్యామిలీ అమరావతిలో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసింది. తన భార్య భువనేశ్వరి ప్రస్తావిస్తూ ఈ వ్యవహారాలు హోమ్ మంత్రి చూస్తున్నందున తనకు ఎలాంటి వివరాలు తెలీవన్నారు.
వెలగపూడి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఫ్యామిలీ సుమారు 25 వేల చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. కొనుగోలు చేసిన ప్లాట్ E-6 రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఉంటుందట. ప్లాట్లను ఆనుకుని ఉన్న మొత్తం భూమి ఐదు ఎకరాలన్నమాట.
అందులో చంద్రబాబు ఫ్యామిలీ కొంత భాగంలో ఇల్లు నిర్మించి, మిగిలిన స్థలాన్ని పచ్చదనం, పార్కింగ్ అభివృద్ధికి ఉపయోగించాలని భావిస్తున్నారట.
గడిచిన పదేళ్లు అమరావతిలో చంద్రబాబు ఫ్యామిలీకి సొంతంగా ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. ల్యాండ్ పూలింగ్ పథకంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ముగ్గురు రైతుల నుండి ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారట.
ఈ లెక్కన సంక్రాంతి తర్వాత ఇల్లు నిర్మాణం మొదలుకావచ్చని సమాచారం. సొంత ఇంటి విషయంలో సీఎం చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించిన వైసీపీ నేతలకు సైలెంట్‌గా బాబు ఫ్యామిలీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిదంటూ టీడీపీ నేతలు చర్చించుకోవడం గమనార్హం.