Satyabhama Today Episode December 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాదేవయ్య డీఎన్ఏ రిపోర్ట్స్ నుంచి తనని ఎవరైనా బయట పడేస్తారేమో అని అందరికి ఫోన్లు చేస్తారు.. ఎవరు మాకు తెలియదు అని అంటారు. అప్పుడు సత్య ఎవరు హెల్ప్ చెయ్యకుండా ఉన్నారా? నేను హెల్ప్ చేస్తాను అంటుంది. ఏంటి నేనే గోతిలోకి తోసేసి నేనే పైకి తీస్తా అంటున్నా అని అనుకుంటున్నారా? కానీ కొన్ని కండీషన్లు ఉన్నాయి అని అంటుంది. మీ పచ్చబొట్టు కొడుకును మీ రూమ్ లోకి తీసుకొస్తాను మీరు బిడ్డలు మార్పిడి గురించి అసలు విషయం చెప్పండి అనేసి అడుగుతుంది పరిస్థితుల్లో మీరు బిడ్డలని మార్పిడి చేశారన్న విషయం మీరు క్లియర్ గా చెప్తే మీ ప్రాణానికి నా ప్రాణాలు అడ్డేస్తానని సత్య మహదేవయ్యతో అంటుంది. ఇక క్రిష్ గంగ ఎవరు? ఇలా చేస్తున్నారు ఈ గంగా వెనకాల ఎవరున్నారు అనేది తెలుసుకోవాలని అనుకుంటాడు? ఇంక బ్యాగ్ ని చెక్ చేస్తే సరిపోతుందని లోపలికి వెళ్తాడు. గంగా తన బ్యాగ్ ని తన తలకిందే పెట్టుకుని పడుకోవడం చూసి షాక్ అవుతాడు.. బ్యాగ్ లో క్రిష్ చిన్నప్పుడు ఫోటో ఉంటుంది అది చూసి షాక్ అయిన క్రిష్ అసలు ఎవరు ఈమె అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.. నరసింహ మనిషి అని అనుకుంటాడు కానీ అది కాదని తెలుసుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. హర్ష విశాలాక్షికి చెప్పి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అమ్మ అని అంటాడు. రోజు రాత్రి నాకు లేట్ అవుతుందమ్మా అని చెప్పగానే విశాలాక్షి నాకెందుకు చెప్తున్నావ్ రా నందిని చెప్పకుండానేసి అడుగుతుంది. అప్పుడే నందిని అక్కడికి వస్తుంది. నీ పక్కనే ఉంది కదమ్మా వినిపిస్తుందని చెప్పాను అనేసి అంటాడు. నైటు లేట్ అవుతుంది నేను లేటుగా వస్తాను ఆఫీస్ పని ఉంది అనేసి నంది నీతో హర్ష అంటాడు.. నేను నైట్ వచ్చిన కాల్ గురించే కదా అనేసి నందిని అడుగుతుంది. దానికి హర్ష సారీ నందిని మైత్రి బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్తున్నాను నీకు మోసం చేయాలని కాదు నేను చెప్తే గొడవవుతుందని అనుకుంటూ వెళ్లిపోతాడు. ఇక ఉదయం మహదేవయ్య ఏ ఇంట్లో బైరవి సోఫాలో కూర్చుని ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే గంగ కూడా అక్కడికి వస్తుంది. బైరవిలాగే ఫోన్ పట్టుకొని కాళ్ళు ఒప్పుకుంటూ ఉంటుంది. అది చూసిన భైరవి కోపంతో రగిలిపోతుంది. ఈ పొగరే తగ్గించుకోమనేది అనేసి గంగకు కౌంటర్లు వేస్తుంది. రేపటితో ఈ ఇండ్లు కూడా నాకు సొంతమవుతుంది మరి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి కదా అక్క అనేసి గంగ అంటుంది. అప్పుడే పంకజం కాఫీ తీసుకొని భైరవి దగ్గరకు వస్తుంది. ఇక గంగ రేపటి నుంచి నీకు జీతం ఇచ్చేది నేనే నువ్వు ముందు నాకు కాఫీ ఇవ్వాలి అనగానే పంకజం పోయి గంగకు కాఫీ ఇస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ అప్పుడే హాల్లోకి వస్తారు. జయమ్మ మాత్రం ఇంట్లో ఇంత సైలెన్స్ ని భరించలేకపోతున్నాం నాకు స్మశానంలో ఉన్నట్లుంది అనేసి అంటుంది.
నాకు షుగర్ టెస్ట్ చేయకుండా షుగర్ లేదని అనుకున్నాను చేసిన తర్వాత నాకు షుగర్ ఉంది అని తెలిసింది ఇప్పుడు ఇది కూడా అంతే. టెస్ట్ రిపోర్టు వస్తే ఏదైతే అది అవుతుంది అనేసి అనగానే బయట టెన్షన్ పడుతుంది. మహదేవయ్య చమటలు తుడుచుకుంటాడు. సత్య మహదేవయ్యకు కౌంటర్ లేస్తుంది. ఏ నిజమైనా బయటికి వస్తేనే అసలు మనిషి ఎలాంటి వారో తెలుస్తుంది అనేసి సత్య అంటుంది. ఆవయ మంచితనం గురించి అందరికీ తెలుసు ఈ రిపోర్ట్ తో ఇప్పుడు మొత్తానికే తెలిసిపోతుంది అనగానే మహదేవయ్యా కంగారు పడతాడు. క్రిష్ పుట్టుక గురించి ఈరోజు తెలిసిపోతుంది మావయ్య ఏదైనా తప్పు చేశారా అనేది ఈరోజుతో తెలిసిపోతుంది అనగానే బైరవి కూడా నా పెనిమిటి గురించి నాకు తెలుసు ఈ రోజు అందరికీ తెలుస్తుంది అని మహదేవయ్యను వెనకేసుకొని వస్తుంది.
ఏంటి పెనిమిటి ఆ కానిస్టేబుల్ ఎవరో ఫోన్ చేశారు కదా రిపోర్ట్స్ తీసుకొస్తానని ఇంకా తీసుకురాలేదేంటి అనేసి బైరవి అడుగుతుంది. ఇక రేణుక అసలు ఇదంతా కాదు సత్య నువ్వు ఏమనుకుంటున్నావో అది చెప్పు అనేసి అడుగుతుంది. అసలు నిజం బయటపడుతుంది అక్క అప్పుడే మాట్లాడదాం అనేసి అంటుంది. ఇక అప్పుడే కానిస్టేబుల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి సత్యకిస్తాడు. ఫోర్స్ వచ్చినట్టు తెలుసుకున్న నరసింహ మీడియాని తీసుకొని అక్కడికి వస్తాడు. అటు క్రిష్ గంగ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికైతే గంగ ఇంటికి వెళ్లి గంగ గురించి తెలుసుకుంటాడు. ఇక సత్యా క్రిష్ కి కాల్ చేస్తుంది. గంగ గురించి అసలు నిజం తెలిసిపోయిందని క్రిష్ సత్యకే షాక్ ఇస్తాడు. నా పేరు అసలు గంగే కాదు శ్రావణి నాటకాలు వేసుకునేది అసలు ఎవరు రప్పించారు కాసేపట్లో తెలిసిపోతుంది అనగానే సత్య టెన్షన్ పడుతుంది.
బయట నరసింహ మహదేవయ్య బయటకు రా అనేసి పిలుస్తాడు. ఇక మహదేవయ్య తరపున సత్యా నరసింహతో గొడవ పెట్టుకుంటుంది. అసలు నిజం ఏంటో ఈ రిపోర్ట్ తో బయటపడుతుంది నువ్వు ఎందుకు అరుస్తున్నావ్ అనేసి నరసింహను అంటుంది. ఆ రిపోర్ట్ లో వెనుక మహదేవయ్య తప్పు చేసినట్టు వస్తే గంగకి మహదేవయ్యకు దగ్గరుండి పెళ్లి చేస్తా అని సవాల్ చేస్తాడు. సత్య రిపోర్ట్స్ ఓపెన్ చేస్తుంటే నరసింహ ఆ రిపోర్ట్స్ ని మా డాక్టర్ ఓపెన్ చేస్తారని చెప్తారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో మహదేవయ్య సేఫ్ అయినట్టు తెలుస్తుంది. సత్య ఓడిపోయినట్టు మహదేవయ్య గెలిచినట్లు కౌంటర్ లేస్తాడు. రేపటితో మరో నిజం బయటపడుతుందని సత్య చెప్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..