BigTV English

AP bullet train: ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఏయే ప్రాంతాల మీదుగా అంటే..

AP bullet train: ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఏయే ప్రాంతాల మీదుగా అంటే..

Bullet Train in AP: సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు ఆలోచనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇంతకీ చంద్రబాబు ప్లాన్ ఏంటి? కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఏపీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు డ్రీమ్. పదేళ్ల నాటి కల ఆయనది. ఇందుకోసం 2014లో ఆయన ప్లాన్ చేశారు. అప్పట్లో సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఆలోచన చేశారు కానీ, కార్యరూపం దాల్చలేదు. కాకపోతే బుల్లెట్ ట్రైన్ (Bullet Train) అనేది ముఖ్యమంత్రి ఆలోచనలో అలాగే ఉండిపోయింది.

ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది టీడీపీ. ఈ క్రమంలో తన కలల డ్రీమ్‌ని తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. రెండురోజుల కిందట హస్తినకు వెళ్లారు సీఎం చంద్రబాబు. పనిలో పనిగా తన బుల్లెట్ ప్లాన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ముందు పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాని నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది.


మంగళవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ విషయాన్ని రివీల్ చేశారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సిటీలను కలుపుతూ బుల్లెట్ రైలు రానుందని వెల్లడించారు. ఆర్థిక పరమైన కార్యకలాపాలు మరింత పెరుగుతాయన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నుంచి ఏపీలో బుల్లెట్ ట్రైన్ పనులు మొదలవుతాయని వెల్లడించారు.

ALSO READ: జనంలోకి జగన్.. దూరంగా సీనియర్లు, ఎందుకు?

సింపుల్‌గా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ నిర్మించనున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు అన్నమాట. త్వరలో ప్రాజెక్టు నివేదిక రెడీ చేసేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు సర్కార్. ఈ ప్రాజెక్టులో ఎక్కువ భాగం ఏపీలో ఉండనుంది. ఒకవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు.

ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలనే ఆలోచన కేంద్రప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.  చెన్నై- మైసూర్ మధ్య హై-స్పీడ్  రైలు కారిడార్‌లో బుల్లెట్ ట్రైన్ నడపాలనే ప్రతిపాదన 2019లో వచ్చింది. 435 కిలోమీటర్ల మేరా 9 చోట్ల స్టాప్ లుండాలని ప్రతిపాదన చేశారు. అందులో చిత్తూరు కూడా ఉన్న విషయం తెల్సిందే.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×