వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఏపీ రాజకీయాల్లో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా సింగయ్య భార్య చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారామె. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా చెప్పారు. చిన్నచిన్న గాయాల వల్ల తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్‌లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, అంబులెన్స్ లో ఏదో జరిగి ఉంటుందని, ఆయన్ను ఏదో చేశారని అన్నారు సింగయ్య భార్య లూర్థు మేరీ.
బిగ్ బ్రేకింగ్ న్యూస్✨
నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి
-సింగయ్య మృతిపై భార్య లూర్డుమేరి
ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్ లో ఏదో జరిగింది
చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?
ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది
లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు..
తాము… pic.twitter.com/LoHxltiLcb
— Rahul (@2024YCP) July 2, 2025
చంద్రబాబు ఏమన్నారంటే..?
సింగయ్య భార్య వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. ఆయన మృతికి వైసీపీ అధినేత జగన్ కారణం అని ఆయనపై కూడా పోలీసులు కేసు పెట్టారు. జగన్ ప్రచార ఆర్భాటం వల్లే సింగయ్య చనిపోయారని అంటున్నారు. కనీసం కారుకింద పడిన మనిషిని ఆస్పత్రిలో చేర్పించేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నించలేదనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం, పోలీసుల వెర్షన్ ఇలా ఉంటే.. సింగయ్య భార్య మాత్రం ఆంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు తాజాగా స్పందించారు. కారు కింద మనిషి పడిపోతే… తీసి కుక్కపిల్లలాగా బయటపడేశారని, సకాలంలో ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేకపోయారనే వైసీపీ నేతలను విమర్శించారు చంద్రబాబు. సింగయ్య భార్యను పిలిపించి మేనేజ్ చేశారని, తన భర్త కారుకింద పడితే ఏమీ కాలేదని, అంబులెన్స్ లోనే ఏదో అయిందని ఆమెతో చెప్పించారన్నారు. చివరకు సింగయ్య మృతిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న నేరస్తుల్ని ఏం చేయాలని ప్రశ్నించారు.
కారు కింద మనిషి పడిపోతే… కుక్కపిల్లను చూసినట్లు చూశారు. చనిపోయాక… ఆయన భార్యను మేనేజ్ చేసి, కారు కింద పడితే కాదు అంబులెన్సులో మా ఆయన్ను ఏమో చేశారు అని చెప్పించారు.
సింగయ్య భార్య ఆరోపణలపై సీఎం చంద్రబాబు#ChandrababuNaidu pic.twitter.com/22x5ZjAK8C
— Telugu360 (@Telugu360) July 2, 2025
కోడికత్తి, గులకరాయి..
తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి డ్రామాలు చూడలేదన్నారు చంద్రబాబు. కోడికత్తి డ్రామా ఆడి, దాన్ని తనపై వేశారని, చివరకు గులకరాయి డ్రామా కూడా తనపైనే పెట్టారని చెప్పారు. తానెప్పుడూ ఎవరి జోలికీ పోనని అన్నారు. తాను హత్యా రాజకీయాలను నమ్ముకోలేదని, అభివృద్ధి రాజకీయాలు, సేవా రాజకీయాలు చేస్తున్నానని వివరించారు చంద్రబాబు. హత్యా రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారాయన.
జగన్ ని కలిసిన తర్వాతే..
సింగయ్య మృతి తర్వాత ఇప్పటి వరకు ఆయన భార్య ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా ఆమె కుటుంబాన్ని తాడేపల్లి కార్యాలయానికి పిలిపించారు జగన్. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కుటుంబానికి గతంలోనే వైసీపీ రూ.10లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ని కలసిన తర్వాత సింగయ్య భార్య, తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. జగన్ అంటే తమకు ఎంతో అభిమానం అని, ఆయన గురించి వ్యతిరేకంగా తాము ఎవరికీ చెప్పలేదన్నారు. ఆయన తమకు సాయం చేశారన్నారు. పోలీసులు వచ్చి వీడియోలు కొన్ని చూపించారని, కొంతమంది లోకేష్ పేరు కూడా చెప్పారన్నారు సింగయ్య భార్య. అయితే సింగయ్య భార్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె జగన్ ని కలసిన తర్వాతే తన కథనం మార్చారని అంటున్నారు. గతంలో సింగయ్య ఆస్పత్రిలో కూడా బాగానే మాట్లాడారని చెప్పిన భార్య, ఇప్పుడు అంబులెన్స్ లో ఏదో జరిగిందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందని పాత వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
హాస్పిటల్ లో మాట్లాడిన సింగయ్యాను అంబులెన్సులో ఎలా చంపేస్తారు అమ్మ.. జగన్ ఇలా చెప్పమన్నాడా ? pic.twitter.com/3986e5P2uW
— Swathi Reddy (@Swathireddytdp) July 2, 2025