Shirish Reddy :టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో నితిన్(Nithin) హీరోగా నటించిన తమ్ముడు (Thammudu)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జులై 4వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి (Shrish Reddy)కూడా ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన గేమ్ ఛేంజర్ (Game Changer)సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారాయి. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మా పని అయిపోయిందని అందరూ హేళన చేశారు . సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే మా పరిస్థితి ఏంటీ అంటూ ఈయన మాట్లాడారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయితే కనీసం హీరో రామ్ చరణ్(Ram Charan) మాట వరసకైనా ఫోన్ చేయలేదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
క్షమాపణలు చెప్పిన శిరీష్ రెడ్డి..
ఇలా రామ్ చరణ్ గురించి ఈయన మాట్లాడటంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించడమే కాకుండా తమ హీరోని అవమానకరంగా మాట్లాడినందుకు ఓ రకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఇలా ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో దిల్ రాజు ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. అలాగే శిరీష్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ మెగా అభిమానులకు క్షమాపణలు(Apology) చెబుతూ.. ఒక లేఖ విడుదల చేశారు. ఇలా శిరీష్ క్షమాపణలు చెప్పినప్పటికీ మెగా అభిమానుల కోపం మాత్రం తగ్గడం లేదని చెప్పాలి. దీంతో ఈయన తాజాగా మరొక వీడియో విడుదల చేశారు.
కించపరచాలని ఉద్దేశం లేదు…
ఈ వీడియోలో భాగంగా ఈయన మాట్లాడుతూ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ నమస్కారం… మా నిర్మాణ సంస్థతో చిరంజీవి గారికి, రాంచరణ్ గారికి చాలా మంచి ఆవినాభావ సంబంధం ఉంది. నాకు రాంచరణ్ గారికి మంచి అనుబంధం ఉంది. ఆయనని అవమానపరిచే విధంగా…కించపరిచే విధంగా మాట్లాడటం నేను ఈ జన్మలో చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నేను చేసిన తప్పే, అయితే అది నాకు తెలియకుండా జరిగింది అందుకు మనస్ఫూర్తిగా రాంచరణ్ గారికి, చిరంజీవి గారికి అలాగే మెగా అభిమానులకు కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను.
#RamCharan #Mega ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన #ShirishReddy #GameChanager #Thammudu #ThammuduOnJuly4th #DilRaju pic.twitter.com/hSquUzisUb
— BIG TV Cinema (@BigtvCinema) July 2, 2025
చరణ్ గారితో నాకున్న అనుబంధాన్ని నేను పాడు చేసుకోవాలనుకోలేదు. నేను అనుకోకుండా మాట్లాడిన మాటలు కారణంగా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. వాటిని నేను అర్థం చేసుకోగలను. రామ్ చరణ్ అవమానపరచటం నా ఉద్దేశం కాదని, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా పొరపాటున ఆ మాట దొర్లిందని క్లారిటీ ఇచ్చారు. మెగా హీరోలతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇలాంటి మంచి అనుబంధ ఉన్న కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే అంత మూర్ఖుడిని నేను కాదు. ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రామ్ చరణ్ చిరంజీవి గారి చొరవ వల్లే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యింది. దయచేసి అభిమానులు మా మధ్య ఉన్న రిలేషన్ ని పాడు చేయద్దని వేడుకుంటున్నాను, త్వరలోనే మా సంస్థలో మరొక సినిమా కూడా రాబోతుంది అంటూ ఈ సందర్భంగా శిరీష్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: కూతురితో రొమాన్స్.. బాలీవుడ్ బుద్ధి చూపించావుగా.. ఏకీపారేస్తున్న నెటిజెన్స్!