Watch Video : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏమి చోటు చేసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ లో తమ అభిమాన ఆటగాళ్లను.. లేదంటే తమకు నచ్చిన హీరో ఎలా ఆడుతున్నాడో అలాంటి ఫోజులు ఇస్తుంటారు. తాాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా లో రామ్ రామ్ చరణ్ బ్యాటింగ్ అందరూ చూసే ఉంటారు. రామ్ చరణ్ బ్యాట్ ని కింద తాకించి ఫ్రంట్ పుట్ వచ్చి బంతిని బలంగా కొడతాడు. ఇక్కడ కూడా అలాగే రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ స్టైల్ లో బ్యాటింగ్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చరణ్ స్టైల్ లో ఆడి బోర్డ పడ్డ క్రికెటర్..
క్రికెట్ ఆడరాని వాళ్లు ఇలాంటి స్టైల్ ఆడితే ఇలాగే బౌల్డ్ అవుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి అది సినిమాలో కాబట్టి ఏ స్టైల్ లో అయినా ఆడుతారు. సినిమాలో ఆటను బయటి ఆటతో పోల్చితే ఇలాగే ఉంటుందని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో “పెద్ది” మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. “పెద్ది” టైటిల్ టీజర్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడటం చూపించారు. రామ్ చరణ్ సిగ్నేచర్ చాటు బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇదే క్రికెట్ షాట్ రీ క్రియేట్ చేశారు. పెద్ది సినిమా క్రికెట్ సీన్ రీక్రేట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా పెద్ది సినిమాలో క్రికెట్ షాట్ ను క్రియేట్ చేశారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో సమీర్ రజ్వి రామ్ చరణ్ స్టైల్ లో సిక్స్ కొట్టాడు. దీంతో ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.
అలా పోల్చుకోవడమే ట్రెండింగ్..
ప్రస్తుతం సినిమా రంగంలో రకరకాల ఆటల గురించి చూపిస్తున్నారు. ఆ సినిమా లో ఆ షాట్ ఆడాడని.. క్రికెటర్లు కూడా ఆ స్టైల్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల్లో బంతి ఏ వైపు వచ్చినా ఆ దిక్కున ఆస్టైల్ లో ఆడుతుంటాడు. క్రికెట్ షాట్లు అంటే అతన్ని చూసి నేర్చుకోవాలని అతని అభిమానులు అంటే.. మరొక అభిమాని మరో ఆటగాడి పేరు చెప్పి ఇతనే ఎక్కువ స్కోర్ చేస్తాడు. నిలకడగా ఆడుతాడు. నిదానంగా ఆడుతాడు అంటూ ఇలా ఒకరి గురించి మరొకరూ గొప్పలు చెప్పుకుంటారు. ఇది కేవలం క్రికెట్ రంగంలో మాత్రమే కాదు.. సినిమా రంగమైనా, రాజకీయ రంగం అయినా.. ఏ రంగంలోనైనా ఒకరితో మరొకరూ పోల్చుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం అలా పోల్చుకోవడమే ఒక ట్రెండింగ్ గా మారిందనే చెప్పవచ్చు.
From Gullies to Tournaments🔥🔥🔥
THALA @BuchiBabuSana 🔥🔥🔥🔥🔥#Peddi #PeddiFirstShot pic.twitter.com/OXiIgke1B7
— HEMCHAND (@HC_1406) July 1, 2025