E-Paper
Advertisement

హీరో దర్శన్ కు భారీ ఊరట.. కోర్ట్ గ్రీన్ సిగ్నల్!

హీరో దర్శన్ కు భారీ ఊరట.. కోర్ట్ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Actor Darshan:అభిమాని రేణుక స్వామి హత్య కేసులో జైలులో ఊసలు లెక్కబెడుతున్న కన్నడ నటుడు దర్శన్ కి ఇప్పుడు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హత్య కేసులో భాగంగా జైలులో ఉన్న వ్యక్తికి భారీ ఊరట లభించడమేంటి? పైగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చింది? ఏ విషయంలో ఇచ్చింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్..

చిత్రదుర్గ రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న రెండో నిందితుడు, విచారణ ఖైదీగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్ (Darshan ) గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై కోర్టు ముందు ఆయన తరఫు న్యాయవాదులు చికిత్సకు అనుమతి ఇవ్వాలి అని కోరగా .. కోర్టు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 59వ సిసిహెచ్ కోర్ట్ ఆయన పిటిషన్ ను శనివారం నాడు విచారించింది. గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. గత 15 నెలలుగా జైలులో నేలపైనే నిద్రిస్తున్నారని, చలి కారణంగా నొప్పి ఎక్కువైందని తెలిపారు.

Advertisement

also read:మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

చికిత్సకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

అయితే ఇందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. గతంలో కూడా వెన్నునొప్పి చికిత్స పేరిట బెయిల్ మీద బయటకు వచ్చి చికిత్స చేయించుకోలేదని, కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం దర్శన్ కు అవసరమైన ఫిజియోథెరపీ , వెన్నునొప్పి చికిత్స చేయించాలని జైళ్ల శాఖ అధికారులను న్యాయాధికారి ఆదేశించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దర్శన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెన్నుపోటుకి అవసరమైన చికిత్సను అందించుకోవాలని కోరుతున్నారు.

దర్శన్ కెరియర్..

Advertisement

దర్శన్ విషయానికి వస్తే.. కన్నడ అభిమానుల చేత ప్రేమగా చాలెంజింగ్ స్టార్, ది బాస్ అని పిలిపించుకుంటున్న ఈయన 2001లో విడుదలైన మెజెస్టిక్ అనే చిత్రం ద్వారా కన్నడ ఇండస్ట్రీ పరిశ్రమకు పరిచయమయ్యారు.ఇక 2012లో వచ్చిన క్రాంతివీర సంగోళ్లి రాయన్న అనే చిత్రంతో కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. యజమాన, నవగ్రహ, కరియా, సారథి, గజ, రాబర్ట్ మొదలైన చిత్రాలు ఈయన కెరియర్ ను పీక్స్ కి చేర్చాయి. ఇలాంటి సమయంలో పవిత్ర గౌడతో రిలేషన్ పెట్టుకోవడం, పెళ్లయ్యి పిల్లలు ఉన్నప్పటికీ ఇలా సంబంధం పెట్టుకోవడంతో రేణుక స్వామి పవిత్ర గౌడను సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో ఇబ్బందులు పెట్టడంతో పవిత్ర గౌడ , దర్శన్ తో పాటు మరికొంతమంది మూకుమ్మడిగా రేణుక స్వామి పై దాడి చేసి హత్య చేశారు. ఇక ఈ హత్య కేసులో భాగంగా ఏ వన్ గా పవిత్ర గౌడ , ఏ 2గా దర్శన్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

Related News

లక్ష్మీదేవిలా మెరిసిన మృణాల్.. ఈ అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

బాక్సాఫీస్ దగ్గర రామాయణ వర్సెస్ సూర్య.. ఎవరి హవా వారిదే!

పెళ్లి బారాత్‌లో నాగదుర్గ డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

వెట్రిమారన్ సినిమాల్లో అలాంటి సీన్లు ఓకేనా? జాన్వీపై నెటిజన్ల సెటైర్లు

‘డ్రాగన్ ‘ క్లైమాక్స్ కోసం మాస్టర్ ప్లాన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో అప్డేట్ రెడీ..!

ఆరోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం..నాగార్జున కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×