Visakhapatnam: గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజుగా చెప్పారు చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజుగా వర్ణించారు. కేంద్రప్రభుత్వం-గూగుల్ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించామన్నారు.
విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి గేమ్ ఛేంజర్
గూగుల్ ఐఏ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతోపాటు దేశానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీ హబ్‌కు భవిష్యత్తులో తుర్లవాడ పేరు మార్మోగుతోందన్నారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ స్వాగతం పలుకుతోందన్నారు. దేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్ వేగా నిలుస్తుందన్నారు.
కేవలం శంకుస్థాపన కాదని, ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న రోజుగా అభివర్ణించారు. సెర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్, భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతోందన్నారు. ఓడరేవుల వంటి కీలక రంగాల్లో పని చేస్తున్న అదానీ గ్రూప్, ప్రజలను కమ్యూనికేషన్‌తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ ఎయిర్ టెల్ అని అన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు రావడం శుభపరిణామంగా చెప్పారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తి కావాలని, ప్రభుత్వ అన్నివిధాలుగా సహకారం అందిస్తుందన్నారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి అశ్వని వైష్ణవ్
అంతకుముందు తెలుగులో ప్రసంగం ప్రారంభించిన కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్. డేటా సెంటర్‌కు హబ్ రాబోతున్న విశాఖకు నగరానికి మరింత ఎనర్జీ అవసరమన్నారు. విజనరీ నాయకత్వం ఉన్న చంద్రబాబుతో ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. ఇకపై విశాఖను ఏఐ నగరంగా పిలవాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ-సీఎం చంద్రబాబు విజనరీకి హ్యాండ్సాఫ్ చెప్పారు.
సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తపన చాలా అవసరమన్నారు. గతంలో సీఎం చంద్రబాబు సైబరారాబాద్ నిర్మించారని, ఐటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. యువనేత లోకేష్ ఎనర్జీ, నాయకత్వం అద్భుతమన్నారు. సమస్యలకు పరిష్కారం చూపడంలో యువనేతలకు లోకేష్ ఆదర్శమన్నారు.
విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించుకుందామన్నారు. కేంద్రం నుంచి సహకారం అందించడంలో వెనుకడుగు లేదన్నారు. మారుతున్న కాలంలో ఎలక్ట్రానిక్స్ తయారీ అత్యంత కీలకంగా మారిందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా ఇప్పుడు భారత్ ను ప్రపంచం గుర్తిస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో ఇప్పుడు భారత్ ది కీలకపాత్ర అని గుర్తు చేశారు.
వైజాగ్ భవిష్యత్తులో ఇంటలిజెన్స్ గేట్ వేగా మారుతుందన్నారు మరొక పారిశ్రామిక వేత్త రాకేష్ మిత్తల్. ప్రాజెక్టు పూర్తి కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే మాకు టార్గెట్ ఇచ్చారని అన్నారు. ఆ టార్గెట్‌ను అందుకునేందుకు కృషి చేస్తామన్నారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పని చేశామన్నారు.
ALSO READ: విశాఖ వైపు ప్రపంచం చూపు.. గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన, సీఎం చంద్రబాబు డ్రీమ్‌కు తొలి అడుగు
ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం తమపై ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఎప్పుడూ వినూత్నంగా ఆలోచన చేస్తోందని, విధానపరమైన స్పష్టత, వేగం ఉంటుందన్నారు. ఏ సంస్థకైనా మౌళిక వసతుల కల్పన ప్రధానమని అదానీ గ్రూప్ ఛైర్ పర్సన్ జీత్ అదానీ అన్నారు.
డిజిటల్ ఫ్యూచర్‌కు ఏపీ గేట్ వేగా మారిందని, టెక్నాలజీ రంగంలో భారత్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. టెక్ రంగంలో ఉన్న అవకాశాలను విశాఖ అంది పుచ్చుకుంటోందని, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా విశాఖ మారబోతోందన్నారు. ఇండియా డిజిటల్ గేట్ వేలుగా ముంబై, చెన్నై నగరాలు ఉండేవని, ఇప్పుడు విశాఖ ఆవిర్భవిస్తోందన్నారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అందరికీ నమస్కారం చెబుతూనే, బాగున్నారా అంటూ మొదలుపెట్టారు. గొప్ప ఆవిష్కరణలకు నాంది పలుకుతున్న శుభ తరుణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక రంగంలో మరిన్ని సంస్కరణలు రాబోతున్నాయని అన్నారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయన్నారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీ అభివృద్దిలో పాలుపంచుకున్న అందరికీ కృతజ్ణతలు తెలిపారు. 2019లో డేటా సెంటర్ కు మొదట ప్రస్తావన వచ్చిందన్నారు. ఆనాడు అనుకున్నామని, ఇవాళ కార్యరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు హృదయ పూర్వకంగా కృతజ్ణతలు చెప్పారు. కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజుని అన్నారు.
విశాఖ ముఖ చిత్రం ఈ రోజు నుంచి మారబోతుందన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరొక లెక్క అని అన్నారు. ఇకపై విశాఖను డేటా ఏఐ హబ్ గా పిలుచుకోబోతున్నామని అన్నారు. గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ నగరం ఉండబోతోందన్నవారు. విశాఖలో జీ అంటే గూగుల్ అనే శబ్దం మార్మోగుతోందన్నారు. చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వంలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయని వివరించారు. పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టిస్తోందన్నారు.