E-Paper
Advertisement

OTT Movie : భార్య కోసం చావునే ఎదురించి పోరాడే భర్త… ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : భార్య కోసం చావునే ఎదురించి పోరాడే భర్త… ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ఏ ఓటిటిలో ఉందంటే?
Advertisement

OTT Movie : ప్రస్తుతం థియేటర్లలో మిడ్ రేంజ్ సినిమాల నుంచి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా అనే పదం సినిమా డిక్షనరీలోకి రాకముందే చిన్న సినిమాలకు థియేటర్లలో పెద్దగా స్థానం ఉండేది కాదు. ఇక ఇప్పుడు లెక్కలన్నీ మారడంతో చిన్న సినిమాలన్నీ థియేటర్లలో తలపడి నష్టాలు తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనతో డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న సినిమాల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు మరో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఇలాగే డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రను పోషించారు. గజేంద్ర అహిరే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రను పోషించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. జీ5 ఒరిజినల్ సిరీస్ గా ది సిగ్నేచర్ మూవీ అక్టోబర్ 4 నుంచి జీ5లోనే అందుబాటులోకి రాబోతోంది.

Anupam Kher completes shooting of The Signature, shares intriguing first  look poster, Bollywood News | Zoom TV

Advertisement

స్టోరీ ఏంటంటే…

జీవితంలో బాధ్యతలన్ని నెరవేర్చి చివరి దశలో అన్నింటిని పక్కన పెట్టి హాయిగా గడిపేద్దాం అనుకునే ఒక వృద్ధ జంట చుట్టూ ది సిగ్నేచర్ స్టోరీ సాగుతుంది. ఓ భర్త ఆశ మరణాన్ని జయిస్తుందా? ఆయన పెట్టే సంతకం పరిస్థితులను మారుస్తుందా? అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో స్టోరీ నడుస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ వృద్ధ జంట బాధ్యతలు మోసింది చాలు, ఇకనైనా హ్యాపీగా బతుకుదాం అనుకొని ఒక వెకేషన్ ను ప్లాన్ చేస్తారు. తీరా ఎయిర్ పోర్టుకు వెళ్లాక సడన్ గా భార్య అనారోగ్యం బారిన పడుతుంది. దీంతో ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. కొన ఊపిరితో కొట్టుకుంటున్న భార్యను బతికించుకోవడానికి భర్త ఏం చేయడానికి అయినా సిద్ధమవుతాడు. అయితే ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల ఉపయోగం లేదు కృత్రిమ శ్వాసను ఆపేయాలని కొడుకు కుండ బద్దలు కొడతాడు. కానీ ఆ భర్త మాత్రం ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసైనా సరే భార్యను కాపాడుకోవాలని సంకల్పిస్తాడు. ఇక హాస్పిటల్ కు అయ్యే ఖర్చు కోసం ఇంటిని అమ్మాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొడుకు మాత్రం సంతకం పెట్టను అంటూ ఆ పనికి అడ్డం పడతాడు. మరి ఇలాంటి సిచువేషన్ లో ఆ భర్త ఏం చేశాడు? భార్యను ఎలా కాపాడుకున్నాడు? అసలు ఇంత చేసినా ఆమె బతికిందా? అనే విషయాలు తెలియాలంటే ది సిగ్నేచర్ మూవీ ఓటిటిలో వచ్చేదాకా ఆగాల్సిందే. సాధారణంగానే తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి తల్లిదండ్రులకు కష్టం వస్తే ఆదుకోవడానికి కన్నబిడ్డలే ముందుకు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేకర్స్ ఈ మూవీ ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×