BigTV English
Advertisement

Tirumala Laddu issue: వైసీపీ పాపప్రక్షాళన? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు!

Tirumala Laddu issue: వైసీపీ పాపప్రక్షాళన? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు!

Tirumala Laddu issue: తిరుమల లడ్డు వివాదం మరింత ముదురుతోందా.. టీడీపీ – వైసీపీ మధ్య ఈ వివాదం ఇంకా రగులుతోందా.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా.. అదే దారిలో వైసీపీ కూడా నడుస్తోందా అంటే అవుననే చెప్పవచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యి అపవిత్రం అయిందంటూ సీఎం చంద్రబాబు ఘాటు విమర్శల జోరు సాగించారు. బాబు చెప్పిన ఆ ఒక్క మాట తూటాలా పేలగా.. వైసీపీపై, మాజీ సీఎం వైయస్ జగన్ పై దేశ వ్యాప్తంగా విమర్శల జోరు సాగింది. మరికొన్ని రాష్ట్రాలలో అయితే ఏకంగా వైయస్ జగన్ ప్లకార్డులతో నిరసనలు సైతం సాగాయి. మరి తమపై వచ్చిన ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు వైసీపీ రెడీ అవుతోందని చెప్పవచ్చు.


సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఈ ఘటనపై స్పందిస్తూ.. లడ్డు కల్తీ వ్యవహారంలో తప్పందా నాటి ప్రభుత్వానిదే.. తిరుమల పవిత్రతను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అంతటితో ఆగక నాటి టీటీడీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల ప్రమేయం సైతం ఉందని విమర్శించారు. కానీ వైసీపీ సైతం అదే స్థాయిలో వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. చివరకు ఏపీ ప్రభుత్వం నెయ్యి అపవిత్రం వ్యవహారంపై సిట్ విచారణకు సైతం ఆదేశించింది. సిట్ విచారణ అధికారులుగా సిన్సియర్ పోలీస్ అధికారులను నియమించి విచారణ చేపట్టింది ప్రభుత్వం. అసలు లడ్డు తయారీలో నాడు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా.. లేదా అనే ప్రశ్నకు సమాధానం సిట్ విచారణలో తేలాల్సి ఉంది. కానీ వైసీపీ మాత్రం సిబిఐ విచారణ చేయాలంటూ తన వాదన వినిపిస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఇక తమ మీద పడ్డ మచ్చను తొలగించుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పవచ్చు. అందుకే ఈ నెల 27న మాజీ సీఎం జగన్  తిరుమలకు వెళుతున్నట్లు సమాచారం. 28న ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.


Also Read: Ys Sharmila: మా అన్న ముంచాడు.. మీరైనా ఆ పని చేయండి.. షర్మిళ కామెంట్స్

వైసీపీ ఇచ్చిన ఈ పిలుపుపై తాము చేసిన తప్పుల నుండి వైసీపీ ప్రాయశ్చిత్తం పొందేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనలో జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోసమే దీక్ష చేపట్టారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తాజాగా పవన్ దీక్షపై విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలే వైసీపీకి రివర్స్ అయ్యాయని, తమ పాలన సమయంలో జరిగిన మహా పాపానికి ప్రాయశ్చిత్తం కోసమే వైసీపీ అన్ని ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ఏదిఏమైనా తిరుమల లడ్డుకి ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల పర్యటన సంధర్భంగా జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×