CM Chandrababu: రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు.
నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం సీరియస్ అయ్యారు. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని… కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలు మరోసారి ఇలా ప్రవర్తిస్తే సహించేది లేదని ఫైరయ్యారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎమ్యెల్యేగా గెలిచిన తర్వాత కొందరు ప్రజలకు దూరంగా ఉంటూ.. నియోజకవర్గాల్లో తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం సీరియస్ అయ్యారు. ఇక నుంచి ప్రజలకు దగ్గరగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలను తేలిగ్గా తీసుకోవద్దని చెప్పారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని సీఎం హెచ్చరించారు.
అలాగే.. విజన్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గాల వారీగా ప్రజలను భాగస్వామ్యం చేయాలని సీఎం కోరారు. ప్రతి ఏడాది 15% ఆర్థిక వృద్ధి రేటును సాధించేలా కృషి చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఈ వార్నింగ్ ద్వారా పార్టీ నాయకులకు క్రమశిక్షణ, బాధ్యతాయుత పాలనపై దృష్టి సారించాలని సంకేతం ఇచ్చారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని, దానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన సీఎం పిలుపునిచ్చారు.
ALSO READ: Indian Army: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ