BigTV English

Indian Army: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ

Indian Army: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ

Indian Army: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేయాలనేది మీ లక్ష్యమా..? పోలీస్ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారా..? అయతే ఇది మీకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇండియన్ ఆర్మీ వచ్చే ఏడాదిలో ప్రారంభమయ్యే 66వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి రూ.1,77,500 వరకు వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, ముఖ్యమైన తేదీల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఇండియన్ ఆర్మీ 2026 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 66వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు (ఎస్‌ఎస్‌సీ టెక్‌-350), మహిళలు (ఎస్‌ఎస్‌సీ టెక్‌- 29)తో వీటితోపాటు డిఫెన్స్ ప‌ర్సన‌ల్ విడోస్ (ఎస్‌ఎస్‌సీ(W) టెక్‌- 1, ఎస్‌ఎస్‌సీ(W) నాన్‌ టెక్‌- 1) నుంచి రెండు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 381


ఈ కోర్సు ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహిస్తారు.

పోస్టులు – వెకెన్సీలు..

* షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (టెక్‌)-66 పురుషులకు- 350 పోస్టులు
* షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (టెక్‌)-66 మహిళలకు- 29 పోస్టులు
* ఎస్‌ఎస్‌సీ(డబ్ల్యూ)(టెక్‌)- 1 పోస్ట్
* ఎస్‌ఎస్‌సీ(డబ్ల్యూ)(నాన్‌-టెక్‌)- 1 పోస్ట్

విభాగాలు: వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఏవియానిక్స్, మైనింగ్, కెమికల్, టెక్స్‌టైల్, బయోటెక్, తదితర ఏఐసీటీ ఆమోదించిన విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: బీఈ, బీటెక్ పాసైన వారు లేదా 2026 ఏప్రిల్ 1 కి ముందు డిగ్రీ పాసయ్యే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ(డబ్ల్యూ)(నాన్‌ టెక్‌) కోసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు: 

మహిళా అభ్యర్థులకు: 2025 ఆగస్టు 21

పురుష అభ్యర్థులకు: 2025 ఆగస్టు 22

వితంతు అభ్యర్థులకు: 2025 ఆగస్టు 29

శారీరక ప్రామాణాలు: 

పురుషులు: 2.4 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 10.30 నిమిషాల్లో పూర్తి చేయాలి. పుష్-అప్స్ 40, పుల్-అప్స్ 6 చేయాలి.

మహిళలు:  2.4 కి.మీ. పరుగు 13 నిమిషాల్లో పూర్తి చేయాలి. పుష్-అప్స్ 15, పుల్-అప్స్ 2చేయాలి.

* స్విమ్మింగ్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: ఎస్ఎస్‌సీ (టెక్) పురుష, మహళా అభ్యర్థులు 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వితంతు అభ్యర్థులు గరిష్ట వయస్సు 35 ఏళ్ల వయస్సు మించరాదు.

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.56,100 – రూ.1,77,500 వరకు జీతం ఉంటుంది.

ట్రైనింగ్: ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇస్తారు. అప్పుడు రూ.56,100 స్టైఫండ్ అందజేస్తారు.

ఉద్యోగ ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రాడ్యుయేషణ్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ సెంటర్స్: అలహాబాద్, భోపాల్, బెంగళూరు, జలంధర్ కాంట్

ALSO READ: EPFO: భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఇంకా 2 రోజుల సమయం..?

కీలక సమాచారం: 

మొత్తం పోస్టుల సంఖ్య: 381

అప్లికేషన్ సమయంలో డిగ్రీలో ఉన్న పేరును టైప్ చేయాలి..

ట్రైనింగ్ సమయంలో పెళ్లి చేసుకోరాదు..

Related News

IBPS Jobs:10,277 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? నేడే లాస్ట్ డేట్..

EPFO: భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఇంకా 2 రోజుల సమయం..?

Airport Authority of India: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. తక్కువ కాంపిటేషన్..

Punjab and Sind Bank: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ షురూ.. ఈ అర్హత ఉంటే చాలు..!!

Bank of Baroda Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు జాబ్ మీదే.. ఇదే మంచి అవకాశం

Big Stories

×