Big Stories

YCP Manifesto 2024: ఎవరి మానిఫెస్టో దమ్మెంత? టీడీపీ Vs వైసీపీ

- Advertisement -

ఇక ఈసారి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏముందో ఓ సారి చూస్తే.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి. పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత.. ఇది వైసీపీ మేనిఫెస్టోలో కనిపించిన అంశాలు. అయితే గతంలో ఇచ్చిన నవరత్నాకలు ఈసారి పొడిగిస్తూనే.. మరిన్ని తాయిలాలు ప్రకటించారు సీఎం జగన్.. వైఎస్‌ఆర్‌ చేయూతను 75 వేల నుంచి లక్షా 50 వేలకు పెంచడం. వైఎస్‌ఆర్ కాపు నేస్తం నాలుగు దశల్లో 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంచడం. ఈబీసీ నేస్తాన్ని 45 వేల నుంచి లక్షా 5 వేలకు పెంచడం.

- Advertisement -

అమ్మ ఒడిని 15 వేల నుంచి 17 వేలకు పెంచడం. సున్నావడ్డీ కింద 3 లక్షల వరకు రుణాలు ఇవ్వడం. రెండు విడతల్లో పెన్షన్‌ను 3 వేల 500కు పెంచడం. ఇలా హామీల వర్షం కురుస్తూ వెళ్లింది. అన్నింటికంటే ముఖ్యంగా రైతు భరోసాను 13 వేల 500 నుంచి 16 వేలకు పెంచడం అనేది కీలక నిర్ణయమనే చెప్పాలి. వీటితో పాటు ఉపాధి పథకాన్నికొనసాగిస్తూ వాహనమిత్రను సొంత టిప్పర్‌, సొంత లారీ ఉన్నవారికి కూడా విస్తరించడం కూడా కీలక నిర్ణయమనే చెప్పాలి.

Also Read: జగన్ బ్యాండేజ్ పై రచ్చ రచ్చ.. !

నిజానికి ఇవన్నీ గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలు.. అమలవుతున్న హామీలే.. అయితే ఈ ఎన్నికలు వచ్చే సరికి వాటిని కొనసాగిస్తూనే మరింత పెంచింది. అయితే ఇదే స్టైల్‌లో టీడీపీ సూపర్ సిక్స్‌ అంటూ కొన్ని హామీలను ప్రకటించింది. అవేంటో కూడా చూద్దాం. అధికారంలోకి రాగానే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం.

నిరుద్యోగులకు నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి. ప్రతి విద్యార్థి కుటుంబానికి 15 వేల ఇవ్వడం. అదే ఇద్దరు విద్యార్థులు ఉంటే 30 వేలు. ముగ్గురు ఉంటే 45 వేలు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20 వేలు. ప్రతి కుటుంబానికి మూడేసి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు అందరికి నెలనెలా 15 వందల రూపాయలు. మహిళలందరికి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం. ఇది టీడీపీ ఇప్పటి వరకు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు.. ఇప్పుడు రాష్ట్రంలో ఈ రెండింటిని కంపెర్ చేస్తూ కొత్త డిబెట్ షురూ అయ్యింది.

ఇటు వైసీపీ మేనిఫెస్టో చూసినా.. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్‌ గమనించినా.. పంచుడు ప్రోగ్రామ్ అనేది కామన్‌గా కనిపిస్తుంది. నిజానికి ఇక్కడో ఫన్నీ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే మొదట ఈ సంక్షేమ పథకాలను ప్రకటించినప్పుడు టీడీపీ విమర్శలు చేసింది. ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని జగన్ వేల కోట్ల అప్పులు చేస్తున్నాడని.. సీన్ కట్ చేస్తే ఎన్నికల ముందు వైసీపీ పోటీ ఇచ్చేలా తాయిలాలు ప్రకటించింది. పోనీ అప్పుడు వైసీపీ సైలెంట్‌గా ఉందా అంటే.. సూపర్ సిక్స్ హామీల అమలు అసాధ్యం డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారని వైసీపీ ప్రశ్నించింది. మళ్లీ ఇప్పుడు సూపర్ సిక్స్‌ను బీట్ చేసేలా వాగ్దానాలు ఇచ్చారు.

ఇప్పుడు ప్రజలు ఏ మేనిఫెస్టోను ఆదరిస్తారు? ఎవరికి అధికారం కట్టబెడతారు? ఇదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.. ఎందుకంటే రెండు పార్టీలు ప్రజలకు భారీగా ఉచితాలు ప్రకటించాయి. సో ప్రకటించిన ఉచితాలను ఎవరు పక్కాగా అమలు చేస్తారో డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు.. కానీ ఇప్పుడు గతంలో నేతలు చేసిన వ్యాఖ్యలు.. వేసిన ప్రశ్నలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అవేంటంటే హామీల అమలుకు బంగారు నాణేలా వర్షం కురుస్తుందా? ఆకాశం నుంచి నోట్ల కట్టలు నేలరాలుతాయా? ఈ పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తేస్తారు? హామీల అమలుకు అప్పులే కదా దిక్కు. ఇందులో ఏ ఒక్క ప్రశ్న కూడా మేం సొంతంగా వేయడం లేదు. అన్ని అయితే టీడీపీ, లేదంటే వైసీపీ నేతలు మాట్లాడిన మాటలే ఇవి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News