E-Paper
Advertisement

GT Vs RCB Preview: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ.. గెలుపెవరిది..?

GT Vs RCB Preview: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ.. గెలుపెవరిది..?
Advertisement

IPL 2024 45th Match- GT Vs RCB Preview: ఐపీఎల్ లో కాకిలెక్కలు మొదలయ్యాయి. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఇప్పుడు ఆడబోయే రెండు జట్లకి కూడా చావో రేవో అన్నట్టే ఉంది. ఇంతకీ ఆ రెండు జట్లు ఏవిటంటే విరాట్ కొహ్లీ ఉన్న ఆర్సీబీ ఒకటైతే,  శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ మరొకటి. నేడు వీటి మధ్య అహ్మాదాబాద్ లోని మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 9 మ్యాచ్ లు ఆడి 4 గెలిచి 7వ స్థానంలో కొనసాగతోంది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే 9 మ్యాచ్ లు ఆడి 2 మాత్రమే గెలిచి ఆఖరి ప్లేస్ లో ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటోంది..

Advertisement

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్ లు జరిగాయి. గుజరాత్ 2 సార్లు గెలిచింది. ఆర్సీబీ ఒకసారి విజయం సాధించింది.

Also Read: రాజస్థాన్..‘రాయల్’ విజయం.. పోరాడి ఓడిన లక్నో

Advertisement

ఆర్సీబీ విషయానికి వస్తే ఆఖరి ప్లేస్ నుంచి ప్లే ఆఫ్ కి వెళ్లడం దాదాపు కష్టంగానే ఉంది. కాకపోతే మిగిలిన జట్లు కూడా అటూ ఇటుగానే ఆడుతున్నాయి. అందువల్ల ఇక్కడ గెలవగలిగితే, కొంచెం ఊపరి అందుతుంది, వాడు ఓడిపోవాలి, వీడు ఓడిపోవాలని లెక్కలు వేసుకుంటూ కూర్చోవచ్చునని అంటున్నారు.

విరాట్ కొహ్లీ తన వరకు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఇప్పుడు సీజన్  లో తనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మిగిలిన వాళ్లు అంతగా లయ అందుకోవడం లేదు. మొన్ననే హైదరాబాద్ మీద విజయం సాధించిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. మరి గుజరాత్ పై
అది కొనసాగుతుందా లేదా చూడాలి. బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ ఫామ్ లోకి రావడం ఒక శుభ పరిణామమని చెప్పాలి.

Also Read: GT vs RCB IPL 2024 Highlights: ఆర్సీబీ విజయపరంపర.. గుజరాత్ ఓటమి

గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ తడబడుతున్నాడు. ఒక మ్యాచ్ లో ఆడితే, మూడు మ్యాచ్ ల్లో ముందుగానే వచ్చేస్తున్నాడు. మిగిలినవాళ్లు ఆడితే జట్టు గెలుస్తుంది. లేదంటే లేదన్నట్టుగా ఉంది. కాకపోతే బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటా యావరేజ్ గానే ఉంది. సాయి సుదర్శన్ , తెవాటియా, రషీద్ ఖాన్ బాగా ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, దర్శన్ వీళ్లు టచ్ లోకి రావాలి. ఇలా చూసుకుంటే రెండు జట్ల బలాలు పెద్ద గొప్పగా లేవు. మరి ఎలా ఆడతారో, ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×