BigTV English

Sidda house robbery attempt: మాజీ మంత్రి ఇంట్లో దోపిడికి ప్లాన్, వాచ్‌మేన్ అలర్ట్‌తో..

Sidda house robbery attempt: మాజీ మంత్రి ఇంట్లో దోపిడికి ప్లాన్, వాచ్‌మేన్ అలర్ట్‌తో..

Sidda house robbery attempt: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో.. ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉండడం గమనించారు దొంగలు. సరిగ్గా నేతల ఇళ్లనే టార్గెట్ చేశారు. కాకపోతే వాచ్‌మేన్, గన్‌మెన్ అలర్ట్‌గా ఉండడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన ఒంగోలులోని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇంట్లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?


ఒంగోలు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇళ్లు దోపిడికీ విఫలయత్నం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఇద్దరు దొంగలు కత్తులతో శిద్ధా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మేన్ దుర్గాప్రసాద్‌పై దృష్టిపెట్టారు. వాచ్‌మేన్‌పై దాడి చేసి ఆయన్ని తమ కంట్రోల్ లోకి తీసుకోవాలని భావించారు ఆ దొంగలు. అయితే ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో గదిలో నిద్రిస్తున్న గన్‌మెన్ అలర్ట్ అయ్యారు. ఆయన రావడంతో అక్కడి నుంచి ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని వెంటనే వన్ టౌన్ పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు.

ఈ వ్యవహారంపై మాజీమంత్రి శిద్దా కొడుకు, టీడీపీ బోర్డు సభ్యుడు సుధీర్‌బాబు రియాక్టయ్యారు. ఇద్దరు దుండగులు కత్తులతో ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయని, అయితే వస్తువులు ఏమీ చోరీ కాలేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పినట్టు వెల్లడించారు.


 

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×