BigTV English

CM Jagan : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం..

CM Jagan : ప్రపంచ మేధావి, దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గోన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసినట్లు ప్రకటించారు . సామాజిక వాడలా విజయవాడ కనిపిస్తుందని తెలిపారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడనే గుర్తు వస్తుందన్నారు. ఈ విగ్రహం పేదలకు , రాజ్యాంగం అనుసరించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సామజిక న్యాయమహాశిల్పం కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

CM Jagan : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం..
breaking news in andhra pradesh

CM Jagan Ambedkar inauguration speech(Breaking news in Andhra Pradesh) :

ప్రపంచ మేధావి, దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసినట్లు ప్రకటించారు. సామాజిక వాడలా విజయవాడ కనిపిస్తుందని తెలిపారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడనే గుర్తు వస్తుందన్నారు. ఈ విగ్రహం పేదలకు , రాజ్యాంగం అనుసరించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


మరణం లేని మహానేత డా. బీఆర్. అంబేద్కర్ అని సీఎం జగన్ కొనియాడారు. అట్టడుగుల ప్రజల తలరాత మార్చిన మహానేత అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేయ్యడం సంతోషంగా ఉందని తెలిపారు. అందర్ని ఒక్క తాటిపై నిలబెట్టామంటే కేవలం అంబేద్కర్ వల్లే సాధ్యం అయిందని పేర్కొన్నారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వం సెంటు భూమి కూడా అందించలేదని విమర్శించారు. ప్రభుత్వ బడులు రూపు రేఖలు మార్చితే పెత్తందారులకు నచ్చడం లేదని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దళితులు అంటే గౌరవం లేదని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని నిర్మాణమంటూ ప్రజల నుండి భూమిని బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.

పెత్తందారులకు దళితులు అంటే చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ లో కూడా దళితులకు గౌరవం ఇచ్చామన్నారు. పేదల పిల్లలు చదివే పాఠశాలలను కూడా పట్టించుకోకపోవడం అంటరానితనమే అని విమర్శించారు. పాఠశాలలను అభివృద్ధి చేసినా ప్రతిపక్షాలకు నచ్చడం లేదని ఆరోపించారు. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయిలో దిగజారిపోయిందో తెలుసుకోవచ్చని సీఎం జగన్ మండిపడ్డారు. పేద పిల్లలకు ట్యాబ్ లు ఇవ్వడంపై కొన్ని పత్రికలు కుట్రపూరిత వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని అలా అడ్డుకోవడం కూడా అంటరానితనమే అని పేర్కొన్నారు. చంద్రబాబు ఎందుకు సామాజిక న్యాయం ఎందుకు అమలు చేయలేకపోయారని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.


తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నట్టు సీఎం జగన్ తెలిపారు. చివరకు పేదలు ప్రయాణించే ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేసారని ఆరోపించారు. పేదలకు అండగా ఉండాలని పెత్తందారీ పార్టీలకు కనీస ఆలోచన లేదని విమర్శలు గుప్పించారు. పేద వాళ్ల పిల్లలు ఎప్పటికి అంటరానితనంగానే నిలిచిపోవాలా? అని ప్రశ్నించారు సీఎం జగన్. తమ ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం మందికి ఎస్సీ, బీసీలే అని ఏపీ సీఎం జగన్ తెలిపారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×