BigTV English

CM Jagan : స్కీములే బాణాలా..? అభివృద్ధి చేయలేదని జగన్ ఒప్పుకున్నట్టేనా..?

CM Jagan : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన జగన్..తన వ్యూహమేంటో చెప్పేశారు. స్కీములే బాణాలుగా ప్రతిపక్షాలపై ఎక్కుపెడుతున్నారు. తమ ప్రభుత్వం 99 శాతం హామీలు అమలు చేసిందన్నారు. లబ్ధిదారులనే తన సైన్యంగా పేర్కొన్నారు. కానీ జగన్ కుడి చేత్తో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ.. ఎడమచేత్తో తిరిగి ప్రభుత్వ ఖజానాకు లాగేస్తున్నారే విమర్శలున్నాయి.

CM Jagan : స్కీములే బాణాలా..? అభివృద్ధి చేయలేదని జగన్ ఒప్పుకున్నట్టేనా..?

CM Jagan : విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన జగన్..తన వ్యూహమేంటో చెప్పేశారు. స్కీములే బాణాలుగా ప్రతిపక్షాలపై ఎక్కుపెడుతున్నారు. తమ ప్రభుత్వం 99 శాతం హామీలు అమలు చేసిందన్నారు. లబ్ధిదారులనే తన సైన్యంగా పేర్కొన్నారు. కానీ జగన్ కుడి చేత్తో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ.. ఎడమచేత్తో తిరిగి ప్రభుత్వ ఖజానాకు లాగేస్తున్నారే విమర్శలున్నాయి.


అమ్మఒడి, చేయూత, ఫీజు రియింబర్స్ మెంట్ ఇలాంటి సంక్షేమ పథకాల నిధులను మహిళల ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వం జమ చేస్తోంది. అదే సమయంలో మద్యం ధరలు పెంచేసింది. అసలు 2019 ఎన్నికల ముందు విడతల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని జగన్ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక విడతల వారీగా మద్య నిషేధం సంగతి అటుంచితే.. ఒక్కసారీగా మద్యం ధరలు మాత్రం పెంచేశారు. ధరలు పెంచితే తాగుబోతులు తగ్గుతారని కొత్త లెక్కలు చెప్పారు. వాస్తవంగా మద్యం ధరలు పెరగడంతో తాగిన వారీ సంఖ్య తగ్గలేదు కానీ ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆ డబ్బులనే తిరిగి సంక్షేమ పథకాలు మళ్లిస్తున్నారనేది ఏపీ ప్రజల మాట. సంక్షేమ పేరుతో అమ్మ చేతిలో డబ్బులు పెట్టి నాన్న చేతి నుంచి ఆ నగదు లాగేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన విమర్శిస్తూనే ఉన్నాయి.

సంగివలస సభలో జగన్ ప్రసంగం మొత్తం సంక్షేమ పథకాలు చుట్టూనే తిరిగింది. మధ్యలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. కానీ ఏపీలో ప్రస్తుతం ఉన్న సమస్యలను ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ప్రధాన సమస్య రోడ్లు. ఏ పట్టణం వెళ్లినా ఓ పల్లెకు పోయిన అన్నివర్గాల ప్రజలు మొరపెట్టుకునే సమస్య ఇదే. గుంతల రహదారులతో నరకయాతన అనుభవిస్తున్నామని జనం నెత్తినోరుకొట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రహదారుల నిర్మాణం చేపట్టలేదు. ఇది సామాన్యులు చెబుతున్న మాట. రోడ్లు బాగు చేస్తానని జగన్ తన స్పీచ్ లో ఎక్కడా హామీ ఇవ్వలేదు.


తాను అర్జునుడిని స్కీములు బాణాలు ప్రజలే కృష్ణడు అని చెప్పుకొచ్చిన జగన్ సంక్షేమ రాగాన్నే అందుకున్నారు కానీ అభివృద్ధి అజెండాను ప్రజలు ముందు ఉంచలేదు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావటం లేదని అనే మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నిరుద్యోగం సమస్య తీవ్రంగా ఉంది. యువతకు ఉపాధి లేదు. ఉద్యోగాలు కల్పన లేదు. ఇలాంటి అంశాలను జగన్ ప్రస్తావించకపోవడం గమన్హారం. స్కీముల చుట్టూనే ఎన్నికల ప్రచారం చేపట్టాలనే వ్యూహంతో జగన్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. అభివృద్ధి చేసినా ఎక్కడా చెప్పలేదు. అంటే అభివృద్ధి చేయలేదని జగన్ ఒప్పకున్నటేనా?

టీడీపీ-జనసేన కూటమి అభివృద్ధి జపాన్ని పటిస్తోంది. మేధావులు, చదువుకున్నవారు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా ఈ కూటమి వ్యూహరచన చేస్తోంది.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అంటున్నారు. మరి ఏపీలో డెవలప్ మెంట్ VS స్కీములు మధ్య పోటీ జరుగుతుందని స్పష్టంగా తేలిపోయింది. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.

Tags

Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×