BigTV English

YSR Law Nestham : యువ న్యాయవాదులకు శుభవార్త.. వైఎస్ఆర్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం..

YSR Law Nestham : యువ న్యాయవాదులకు శుభవార్త..  వైఎస్ఆర్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం..

YSR Law Nestham latest news(Andhra pradesh today news): ఏపీలో “వైఎస్ఆర్ లా నేస్తం” నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. 2023–24 సంవత్సరానికి తొలి విడత ఆర్థిక ప్రోత్సాహకాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 2,677 మంది యువ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల‌ చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు 5 నెలలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సీఎం జగన్ అన్నారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపై చూపించాలని సూచించారు. తాను అదే ఆశిస్తున్నానని.. ఈ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరారు.


కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడేళ్లపాటు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తోంది. ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తోంది. మూడేళ్లలో ఒక్కో న్యాయవాదికి మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న నిధులతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయ­వాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.

న్యాయ­వాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడ్వకేట్‌ జన­రల్‌ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో లా, ఫైనాన్స్‌ సెక్రటరీ సభ్యు­లుగా ఉంటారు. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్‌ మెడిక్లెయిమ్‌ పాల­సీలు కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం చేసింది.


ఆర్థికసాయం కోరే న్యాయవాదులు ఆన్‌లైన్‌లో sec_law@ap. gov.in ద్వారా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్ఆర్ లా నేస్తం పథకం పొందడంలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 నంబర్‌ కాల్ చేసి సంప్రదించాలి.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×