BigTV English

CM Jagan : సిద్దం సభ.. రొటీన్ ప్రసంగం.. నిరాశలో కార్యకర్తలు..

CM Jagan : ఉత్తరాంధ్రలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ‘సిద్ధం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. అయితే సభలో జగన్ ప్రసంగం.. ఆపరేషన్ సక్సెస్ పెషేంట్ డెడ్ లాగా తయారైందని ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.. ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఆ జిల్లాలకు ఏం చేశారు? ఏం ప్రాజెక్టులు తెచ్చారు? ఏం అభివృద్ధి చేశారో ముఖ్యమంత్రి చెప్పకపోవడం విపక్షాల విమర్శలకు కారణమవుతోది.. విశాఖకు మకాం మారుస్తాం అంటున్న జగన్‌ పరిపాలనా రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

CM Jagan : సిద్దం సభ.. రొటీన్ ప్రసంగం.. నిరాశలో కార్యకర్తలు..

CM Jagan : ఉత్తరాంధ్రలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ‘సిద్ధం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. అయితే సభలో జగన్ ప్రసంగం.. ఆపరేషన్ సక్సెస్ పెషేంట్ డెడ్ లాగా తయారైందని ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.. ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఆ జిల్లాలకు ఏం చేశారు? ఏం ప్రాజెక్టులు తెచ్చారు? ఏం అభివృద్ధి చేశారో ముఖ్యమంత్రి చెప్పకపోవడం విపక్షాల విమర్శలకు కారణమవుతోది.. విశాఖకు మకాం మారుస్తాం అంటున్న జగన్‌ పరిపాలనా రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదలుపెట్టిన.. సిద్దం.. మొదటి సభకు ఉత్తరాంధ్ర వేదికైంది.. భీమిలి నియోజకవర్గంలో జరిగిన సిద్దం సభలో జగన్ ప్రసంగం హాజరైన జనాలకే కాదు.. వైసీపీ శ్రేణులకు కూడా నిరాశే మిగిల్చింది.. ‘సిద్ధం’ అనగానే జగన్‌ ఏవో కొత్త వరాలతో వస్తారని అంతా సిద్దమై వస్తే.. ఎన్నికల ప్రచార సభకు అసలు జగనే సిద్ధమై వచ్చినట్లు కనిపించలేదు.. ప్రసంగం ప్రారంభం నుంచి చివరి దాకా జగన్‌ నవరత్నాల జపానికే పరిమితమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..

ఎప్పుడూ లేని విధంగా గంటంపావు పాటు సాగిన సీఎం ప్రసంగంలో సంక్షేమ మంత్రాన్నే పదేపదే వల్లెవేశారు.. నవరత్నాల్లోని సంక్షేమ పథకాలైన పింఛన్లు, ఆసరా, విద్యార్థులకు ట్యాబ్‌లు, చేయూత అంటూ చెప్పుకొచ్చారు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా.. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధీ చేయలేదని, 56 నెలల్లో ఎక్కడ చూసినా జగన్‌ మార్కు పాలన కనిపిస్తుందంటూ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడానికి తాపత్రయపడ్డారు.


ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఉత్తరాంధ్రకు ఏం చేశారు? ఏం ప్రాజెక్టులు తెచ్చారు? ఏం అభివృద్ధి చేశారో చెప్పకపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం నింపినట్టు కనిపించింది.. విశాఖకు మకాం మారుస్తామని ఎప్పటికప్పుడు ముహూర్తాలు ప్రకటించే జగన్.. అసలు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రస్తావనే తేలేదు.. అలాగే సభలో విశాఖ రాజధాని, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ వంటి కీలకాంశాల విషయంలో ప్రభుత్వ స్టాండ్ ఏంటో? సీఎం చెప్తారని వైసీపీ కేడర్ భావించింది.. కానీ సీఎం జగన్ ప్రసంగం మొత్తం నాలుగున్నర ఏళ్లలో చేసిన సంక్షేమం.. విపక్షాలపై విమర్శలకే పరిమితమైంది.

తనను చూసే జనం ఓట్లు వేస్తారన్న ఫీలింగ్ జగన్‌లో ముందు నుంచీ కన్పించేది.. దానికి తగ్గట్లే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే తాను నియమించుకున్న వాలంటీర్ల సైన్యానికి ఎక్కువ పెత్తనం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి.. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలంటూ ప్రతిపక్షాలు మొదటి నుంచి విమర్శిస్తుంటే కొట్టిపారేశారు జగన్.. అయితే సిద్ధం సభలో జగన్‌ అందుకు భిన్నంగా.. వాలంటీర్లు మనవాళ్లే అని చెప్పడానికి గర్వపడుతున్నానని, మన పార్టీని అభిమానించే వాళ్లంటూ అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు.. అలాగే వైసీపీ జగన్‌ది కాదని, మీ అందరి పార్టీ అంటూ వాయిస్ మార్చారు.. పార్టీలో కష్టపడిన వారికి అంచెలంచెలుగా పెద్దపీట వేశానని చెప్పుకొచ్చారు.

మరి పార్టీ కోసం ముందునుంచి కష్టపడుతుంటే.. తమకు అవమానాలు ఎదురవుతున్నాయని పలువురు నాయకులు పార్టీ నుంచి ఎందుకు బయటకుపోతున్నారో ఆయనకే తెలియాలి..

సభకు వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ కార్యకర్తలే కావడంతో నినాదాలు హోరెత్తాయి.. దీంతో పార్టీ అధినేత సీఎం జగన్ లో కొత్త ఉత్సాహం కనిపించింది.. జగన్ ప్రసంగించినంత సేపు సొంత కేడర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉంది.. అయితే సీఎం, వైసీపీ నాయకులు ఆశించినంత స్థాయిలో కార్యకర్తలు వచ్చారా అంటే మాత్రం సమాధానం వెతుక్కోవాల్సి వస్తుంది.

విశాఖపట్నం, విజయనగరం మధ్య వైసీపీ ఎన్నికల ప్రచారానికి తొలి సిద్ధం సభను ఏర్పాటు చేశారు.. 34 నియోజకవర్గాలు ఉన్న మూడు జిల్లాలలో దాదాపుగా మూడు లక్షల మంది కార్యకర్తలను మొబలైజ్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ.. మూడు జిల్లాల్లో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆ భాద్యతలను అప్పగించింది. 10 రోజుల ముందు నుండే భారీగా ఏర్పాటు చేస్తూ సిద్ధం సభకు అన్ని నియోజకవర్గాల నుండి కార్యకర్తలు వచ్చేలా ప్లాన్ చేశారు. సభ కోసం వైసీపీ అధిష్టానం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చేసినా ఆశించిన స్థాయిలో కార్యకర్తలను సభకు తీసుకుని రావడంలో నేతలు ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు లక్షల మంది కార్యకర్తలు వస్తారు ని వైసీపీ అంచనా వేసినా ఉత్తరాంధ్ర సిద్ధం సభకు మాత్రం లక్ష మంది లోపే వచ్చినట్లు తెలుస్తోంది.. సభా ప్రాంగణం కెపాసిటీ 50 నుంచి 60 వేల మంది మాత్రమే అవ్వడం గమనించాల్సిన విషయం.. ఒక్కో నియోజకవర్గం నుండి 10వేల మంది వచ్చేలా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తే.. ఆ ప్లాన్ వర్కౌట్ అయినట్లు కనిపించ లేదు.. ఒక్కో జిల్లా నుండి 25 వేల నుండి 30వేల మధ్యలో కార్యకర్తలు వచ్చినట్లు పోలీసు నిఘా వ్యవస్థ అంచనా వేస్తుంది.

ప్రతి మీటింగ్‌లో సాగినట్లే ఈ సభలోనూ జగన్ ప్రసంగం సాగడం.. కొత్తదనం కోసం ఆశించిన కార్యకర్తలకు మింగుడుపడినట్లు కనిపించలేదు.. ప్రతిపక్షాలను, ముఖ్యంగా షర్మిలను ఎదుర్కొనేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారని ఆశించిన వాళ్లకు .. ఎటువంటి దిశానిర్దేశం చేయలేకపోయారాయన.. తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడైనా ఆ దిశగా గైడ్ చేస్తారని చెవులురక్కించి ఉన్న కేడర్.. సభ ముగిసిన తర్వాత పాతపాటే పాడారని గొణుక్కుంటూ వెళ్లిపోవాల్సి వచ్చింది .

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×