BigTV English

Prodduturu YCP : రాచమల్లు వద్దంట.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి వైసీపీ నేతల షాక్..!

Prodduturu YCP : కడప జిల్లాలోని ఆ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి సెగలు కాకరేపుతున్నాయి .. వరుసగా రెండు సార్లు గెలిచి రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేయడానికి.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న అక్కడి ఎమ్మెల్యేకి.. సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు.. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని బహిరంగంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు.. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పరిస్థితి వైసీపీ పెద్దలను ఉలిక్కిపడేలా చేస్తోందంట.. ఇంతకీ ఆ నియోజకర్గం ఏది?.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎందుకా పరిస్థితి వచ్చింది?

Prodduturu YCP : రాచమల్లు వద్దంట.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి వైసీపీ నేతల షాక్..!

Prodduturu YCP : కడప జిల్లాలోని ఆ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి సెగలు కాకరేపుతున్నాయి .. వరుసగా రెండు సార్లు గెలిచి రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేయడానికి.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న అక్కడి ఎమ్మెల్యేకి.. సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు.. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని బహిరంగంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు.. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పరిస్థితి వైసీపీ పెద్దలను ఉలిక్కిపడేలా చేస్తోందంట.. ఇంతకీ ఆ నియోజకర్గం ఏది?.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎందుకా పరిస్థితి వచ్చింది?


కడప జిల్లా లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి ప్రొద్దుటూరు.. అక్కడ వైసీపీ అభ్యర్ధిగా 2014, 2019 ఎన్నికల్లో గెలిచి.. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కి ఈసారి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు.. రాచమల్లుకు టికెట్ కు ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని ప్రొద్దుటూరు వైసీపీ నేతలు తెగేసి చెప్తుండటం జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.. వారి ఓపెన్ స్టేట్‌మెంట్‌తో ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తరాస్థాయికి చేరుతున్నాయి ..

గత కొంత కాలంగా ఎమ్మెల్యే రాచమల్లు, కొత్తపల్లె సర్పంచ్ అయిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రా రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి.. రాచమల్లును రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తమను పట్టించుకోకుండా దూరం పెడుతున్నారని శివచంద్రా రెడ్డి వర్గం ఆరోపిస్తోంది.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా రాచమల్లు గెలుపులో కీలక పాత్ర పోషించిన కౌన్సిలర్లు మునీర్, ఇర్ఫాన్, మురళీధర్ రెడ్డి వంటి వారు ఎమ్మెల్యేపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.. అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గం కూడా శివప్రసాదరెడ్డిపై భగ్గుమంటోంది.


జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి బహిరంగంగానే ఎమ్మెల్యే రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.. తన వర్గీయులతో కలిసి ప్రొద్దుటూరులో మీటింగ్ పెట్టుకున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డికి కాకుండా.. ఎవరికి ఇచ్చినా తాము సహకరిస్తామని బహిరంగంగా ప్రకటించారు.. తిరిగి ఎమ్మెల్యే రాచమళ్లుకే టికెట్ ఇస్తే 30 నుంచి 40 వేల ఓట్లతో ఓడిస్తామని ఆయన హెచ్చరించడం విశేషం..

జగన్‌ని మళ్లీ సీఎం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తుంటే.. ఎమ్మెల్యే పనితీరు అందుకు వ్యతిరేకంగా శివచంద్రారెడ్డి ఫైర్ అవుతున్నారు.. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి.. ప్రొద్దుటూరుని జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని శివచంద్ర ప్రకటించడం చూస్తుంటే .. ఆయన వర్గం రాచమల్లుపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుంది.

మరో ప్రక్క ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పై వ్యతిరేకగళం వినిపిస్తున్నారు.. కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే తాము సహకరించమని బహిరంగంగా ప్రకటిస్తుంటే.. మరొక కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష అయితే.. తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటూ.. ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు ..

ఆ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తాము సహకరిస్తామని అసంతృప్తి నేతలంతా అంటున్నారు .. ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా అలా రచ్చకెక్కడం వైసీపీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా తయారైందంట .. మరి సొంత జిల్లాలో తలెత్తిన ఈ పరిస్థితిపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×