BigTV English

No Punches in CM Jagan Speech: ఒకరోజు రెస్ట్, జగన్ ప్రచారంలో అవే మాటలు, మిస్సయిన పంచ్‌లు!

No Punches in CM Jagan Speech: ఒకరోజు రెస్ట్, జగన్ ప్రచారంలో అవే మాటలు, మిస్సయిన పంచ్‌లు!

No Punches in CM Jagan Speech: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు కేవలం మూడురోజులు మాత్రమే ఉన్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుందని అందరూ భావించారు. కానీ అధికార పక్షం నుంచి ఎలాంటి ఎటాకింగ్ లేదు. ఎప్పుడు మాదిరిగానే ప్రచారం చప్పగానే సాగింది.. సాగుతోంది. ఒకరోజు విశ్రాంతి తీసుకుని ప్రచారానికి వచ్చారు సీఎం జగన్.


గురువారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో సీఎం జగన్ స్పీచ్ చప్పగా సాగింది. ఎంతసేపు ఐదేళ్లలో ప్రభుత్వం అందజేసిన పథకాలు గురించి ఊకదంపుడు ఉపన్యాసమే ఇచ్చారు. రాబోయే ఐదేళ్లు తాము ఏమి చేస్తామన్నది ఎక్కడ ప్రస్తావించలేదు. విపక్షాల ధీటుగా తమ మేనిఫెస్టో ఉందని చెప్పలేకపోయారు ఫ్యాన్ పార్టీ అధినేత. ఇందుకు కారణాలు లేకపోలేదు.

రీసెంట్‌గా ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం జగన్, ఓ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఒక్కటేనని, ఆ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లకపోవడమే కారణమన్నారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో విజయం సాధించిందన్నారు. తాము అలా కాదని, ఐదేళ్లలో తాము చేసింది చెబుతున్నామన్నారు.


Also Read: ఎన్నికల వేళ.. మండుతున్న పల్నాడు, వైసీపీ అభ్యర్థి భార్యపై దాడి

ఎప్పటిమాదిరిగా విలువలు, విశ్వసనీయత గురించి ప్రస్తావించారు సీఎం జగన్. వైసీపీ హయాంలో ఏపీకి లక్షల కోట్లు పెట్టబడులు వచ్చాయంటూ మరో అబద్దాన్ని బయటపెట్టారు సీఎం జగన్. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని కల్యాణదుర్గం స్పీచ్‌లో పాత పాటే మొదలుపెట్టారు. ఓటర్లలో జోష్ నింపేందుకు ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బయటపెట్టాలని, గాజు గ్లాసును సింకులో ఉంచాలని సినిమా స్టయిల్ డైలాగ్స్ చెప్పారు.

ఓటుకు మూడు లేదా నాలుగు వేలు టీడీపీ ఇస్తోందని, అవి తీసుకుని ఫ్యాన్‌కు ఓటు వేయాలన్నారు సీఎం జగన్. మన దగ్గర టీడీపీ దోచుకున్న డబ్బులనే మనకు తిరిగి ఇస్తోందన్నారు. గడిచిన ఐదేళ్లలో దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ పాత పాటే పాడారు. అంతేగానీ టీడీపీ కంటే తాము మంచి పథకాలు పెట్టామని ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రచారంలో జగన్ తమ పథకాల గురించి చెబుతూ డిఫెన్స్‌లో పడిపోయారని అక్కడి ఓటర్లు చెప్పుకోవడం కొసమెరుపు.

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×