BigTV English

CM Jagan : నేను అర్జునుడిని.. స్కీములే బాణాలు.. ప్రజలే కృష్ణుడు..

CM Jagan : సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో ‘సిద్దం’ పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఉత్తరాంధ్ర నుంచి కార్యకర్తలు హాజరయ్యారు. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలకు సూచించారు. టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలన్నారు. కుల, మత పార్టీలకతీంగా అందరికీ సంక్షేమం అందించామన్నారు. మన పథకాలకే మన బలంమన్నారు.

లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన అందించామని సీఎం జగన్ అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. రైతులకు తోడుగా ఆర్ బీకేలను నిర్మించామన్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్యను అందించామని తెలిపారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్ బ్యాండ్లు తీసుకొచ్చామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాయన్నారు. 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు ఏం అభివృద్ది చేశారో చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు.

సభకు వచ్చిన ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. టీడీపీ-జనసేనలు చేసే కుట్రలను పసిగట్టి తిప్పకొట్టాలన్నారు. ఇటు పక్క పాండవ సైన్యం.. అటు కౌరవ సైన్యం ఉందన్నారు. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది.. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు..ఇక్కడ ఉన్నది అర్జునుడు అన్నారు. అర్జునుడికి తోడుగా కృష్ణుడి లాంటి ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల యుద్దంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోతారని జగన్ జోస్యం చెప్పారు. మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తులు పోయారన్నారు. బాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని సీఎం జగన్ ఆరోపించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×