BigTV English

Panyam Assembly Constituency : పాణ్యంలో పాగా వేసేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Panyam Assembly Constituency : పాణ్యంలో పాగా వేసేదెవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?
Panyam Assembly Constituency

Panyam Assembly Constituency : నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ రాజకీయాలు ఏపీ వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక్కడ సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ కాటసాని రాంభూపాల్ రెడ్డి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య ద్విముఖపోరుకు మరోసారి పాణ్యం రెడీ అయింది. కాటసాని ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి ఏడోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి పాణ్యం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

కాటసాని రాంభూపాల్ రెడ్డి VS గౌరు చరితా రెడ్డి


YCP 57%
TDP 36%
OTHERS 7%

గత ఎన్నికల్లో పాణ్యంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి 57 శాతం ఓట్ షేర్ సాధించి ఘన విజయం నమోదు చేసుకున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన గౌరు చరితా రెడ్డి 36 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో పాణ్యం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కాటసాని రాంభూపాల్ రెడ్డి (YCP)

కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • జనంలో పాజిటివ్ ఇమేజ్
  • కరోనా టైంలో నిత్యవసరాల పంపిణీలో కీలకం
  • స్ట్రాంగ్ క్యాడర్ సపోర్ట్
  • సామాజిక సాధికార యాత్రలో కీలక పాత్ర
  • ప్రభుత్వ కార్యక్రమాల అమలులో యాక్టివ్

కాటసాని రాంభూపాల్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • పాణ్యంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం
  • గ్రామీణ ప్రాంతాలకు సరైన రోడ్లు లేకపోవడం
  • పాణ్యంలో నిరుద్యోగ సమస్య పెరగడం
  • కొల్లూరు బ్రిడ్జి కట్టకపోవడం
  • నియోజకవర్గంలో తాగు నీటి సమస్యలు

గౌరు చరితా రెడ్డి (TDP)

  • గౌరు చరితా రెడ్డి ప్లస్ పాయింట్స్
  • గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి
  • బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ లో యాక్టివ్
  • టీడీపీ కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర

గౌరు చరితా రెడ్డి మైనస్ పాయింట్స్

  • పార్టీ మారడంతో జనంలో తగ్గిన ఇమేజ్
  • కాటసాని మాదిరి స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ లేకపోవడం

కుల సమీకరణాలు

ఎస్సీ 32%
ముస్లిం 21 %
యాదవ్ 12%
బోయ 7%
కాపు 6%
రెడ్డి 5%

పాణ్యంలో ఎస్సీ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. ఇందులో 55 శాతం మంది జగన్ పార్టీకి, 40 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. ముస్లింలలో 50 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఇక యాదవ్స్ లో 45 శాతం జగన్ పార్టీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని సర్వేలో తమ అభిప్రాయంగా వెల్లడించారు. బోయల్లో 50 శాతం మంది ఫ్యాన్ గుర్తుకు, 45 శాతం మంది సైకిల్ గుర్తుకు, 5 శాతం మంది ఇతరులకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. కాపుల్లో 50 శాతం జగన్ పార్టీకి, 45 శాతం టీడీపీకి,5 శాతం ఇతరులకు అండగా ఉంటామంటున్నారు. రెడ్లలో 60 శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

కాటసాని రాంభూపాల్ రెడ్డి VS గౌరు చరితా రెడ్డి

YCP 52%
TDP 43%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి 52 శాతం ఓట్లు సాధించి గెలిచే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డికి 43 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తేలింది. పాణ్యంలో జనం వైసీపీవైపు చూస్తుండడానికి కారణం సంక్షేమ పథకాల ప్రభావమే అని సర్వేలో తేలింది. అమ్మఒడి, జగనన్న చేయూత, జగనన్న విద్యాదీవెన, కాపు నేస్తం వంటివి ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి. ఆరుసార్లు గెలిచిన కాటసాని పాజిటివ్ ఇమేజ్ కూడా బలంగా పని చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా వైసీపీ గెలిచేందుకు దోహదపడే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అయితే గౌరు చరితారెడ్డి ఇన్ ఫ్లూయెన్స్ కూడా పాణ్యంలో రోజురోజుకూ పెరుగుతోంది. అదనపు ఓట్లు రాబట్టడంలో ఈ ప్రభావం ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది కీలకంగా మారుతోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎంత రాబడితే అంత ఓట్ షేర్ పెరిగే అవకాశాలైతే టీడీపీకి కనిపిస్తున్నాయి.

.

.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×