Keralam: ట్రీట్‌మెంట్ తర్వాత కేరళం నుంచి వచ్చే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడి ప్రజలు చూపిన ఆధరాభిమానులు తనను కదిలించిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. పవన్ పోస్టుపై స్పందించిన కేరళం సీఎం వీడీ సతీశన్ ధన్యవాదాలు తెలిపారు. మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నామని రాసుకొచ్చారు.
ముంబైలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఆ భుజానికి చికిత్స కోసం కేరళం వెళ్లారు. డాక్టర్ సీతారామ్ వద్ద ఆయుర్వేదిక్ చికిత్స తీసుకున్నారు. చికిత్స పూర్తి తర్వాత కేరళం నుంచి ఏపీకి తిరిగి వచ్చే సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కేరళం పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మూడువారాల పాటు సాగిన చికిత్స సమయంలో కేరళం ప్రజల ఆప్యాయత, ఆదరణ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించినట్లు రాసుకొచ్చారు. తనకు ఇది కేవలం చికిత్స కాలం కాదని.. స్వస్థత, ప్రశాంతత, మధుర జ్ఞాపకాల సంపాదించుకునే సమయమని మనసులోని మాట బయటపెట్టారు.
కేరళంలో ఉన్న సమయంలో త్రిప్రయార్ శ్రీరామస్వామి, గురువాయూర్ శ్రీకృష్ణ, మమ్మియూర్ శ్రీ మహాదేవ్, చెట్టికుళంగర శ్రీ భగవతి అమ్మ ఆలయాలను దర్శించుకున్నారు. శతాబ్దాల చరిత్ర, సంప్రదాయాలతో ఆలయాల దర్శనం తాను ఎంతో ప్రశాంతతను, భక్తి భావాన్ని పొందానన్నారు. కేరళ ఆలయాలు మన ప్రాచీన నాగరికత, వారసత్వానికి సజీవ ప్రతిరూపాలని అభివర్ణించారు పవన్ కల్యాణ్. తన పర్యటన సజావుగా సాగేందుకు సహకరించిన కేరళ సీఎం వీడీ సతీశన్, డీజీపీ, పోలీసు బృందాలు, త్రిశూర్, అలప్పుజ, కొచ్చి జిల్లా యంత్రాంగాలకు ధన్యవాదాలు తెలియజేశారు. స్టేట్ ప్రోటోకాల్ విభాగం అందించిన సహకారం, ఏర్పాట్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి దశలో భద్రత, సౌకర్యాల విషయంలో చూపిన వృత్తిపరమైన శ్రద్ధను ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ALSO READ: బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం
పవన్ కళ్యాణ్ పోస్టుకు కేరళం సీఎం వీడీ సతీశన్ రియాక్ట్ అయ్యారు. విశ్రాంతి తీసుకోవడానికి, చికిత్స కోసం తమ రాష్ట్రానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ప్రజల ఆప్యాయత, చారిత్రక ఆలయ దర్శనాలు, ఆయనకు శాంతి అందించాయని తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో మరోసారి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నామని, పవన్ పూర్తిగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ఎక్స్‌లో రాసుకొచ్చారు కేరళం ముఖ్యమంత్రి.
Thank you, Shri @PawanKalyan ji, for your kind words and for choosing Keralam for your rest and recovery.
It is heartening to know that the warmth of our people and the darshan at our ancient temples brought you peace and healing.
We look forward to hosting you again soon. On… https://t.co/11HcfDy0Pc
— V D Satheesan (@vdsatheesan) September 13, 2026