E-Paper
Advertisement

ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ పక్కన ఈ చిన్న హొల్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా?

ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ పక్కన ఈ చిన్న హొల్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా?
Advertisement

Laptop Webcam Holes: మనం ప్రతిరోజూ ఆఫీస్ పనుల కోసమో, లేదా ఆన్‌లైన్ క్లాసుల కోసమో లాప్‌టాప్‌లను వాడుతూనే ఉంటాం. అయితే లాప్‌టాప్ స్క్రీన్ పైభాగంలో వెబ్‌క్యామ్ పక్కన గమనిస్తే.. చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. అందులో ఒకటి వీడియో కాల్స్ కోసం వాడే మెయిన్ కెమెరా అని మనకు తెలిసిందే. అయితే, దాని పక్కన ఉండే మిగతా రంధ్రాలు ఎందుకు ఉన్నాయో ఆలోచించారా? మనలో చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ, వాటి వెనుక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మన ప్రైవసీని కాపాడటంలో, అలాగే సెక్యూర్‌గా లాగిన్ అవ్వడంలో ఈ ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

మైక్రోఫోన్, లైట్ ఇండికేటర్:

కెమెరా పక్కనే ఉండే చిన్న రంధ్రాలలో ఒకటి మైక్రోఫోన్. మనం మీటింగ్స్‌లో మాట్లాడేటప్పుడు మన వాయిస్ ఎదుటివారికి స్పష్టంగా వినబడేందుకు దీన్ని అక్కడే ఇస్తారు. లాప్‌టాప్ కింది భాగంలో ఇస్తే ఫ్యాన్ సౌండ్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుందని ఇలా డిజైన్ చేస్తారు. అలాగే, కెమెరా ఆన్‌లో ఉందో లేదో చెప్పడానికి ఒక ఎల్ఈడీ ఇండికేటర్ కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు ప్రైవసీ కోసం కెమెరాను క్లోజ్ చేసుకునేలా కవర్ సదుపాయం కూడా ఇస్తుంటాయి.

ముఖం గుర్తుపట్టే మరో కెమెరా:

Advertisement

ఇక ఇవన్నీ కాకుండా అచ్చం కెమెరా లాగే కనిపించే మరో రంధ్రం కూడా లాప్‌టాప్‌లో కనిపిస్తుంది. నిజానికి అది కూడా ఒక కెమెరానే. Windows Hello అనే స్పెషల్ ఫీచర్ కోసం దీన్ని అందిస్తారు. మనం లాప్‌టాప్ ముందు కూర్చోగానే, ఇది మన ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఆ ముఖం మీదే అని వంద శాతం నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే లాప్‌టాప్ అన్‌లాక్ అవుతుంది. దీన్నే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటారు.

పాస్‌వర్డ్‌ల కంటే ఎంతో సేఫ్:

సాధారణంగా మనం పెట్టుకునే పాస్‌వర్డ్‌లను ఎవరైనా సులువుగా గెస్ చేసి హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కానీ ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది దానికి పూర్తి భిన్నం. ఇది పాస్‌కీస్ పద్ధతిలో పనిచేస్తుంది. ఒకరి ముఖాన్ని మరొకరు అచ్చం అలాగే కాపీ చేయడం అసాధ్యం కాబట్టి.. ఈ టెక్నాలజీతో మీ లాప్‌టాప్‌లోని డేటాకు ఫుల్ సెక్యూరిటీ లభిస్తుంది. అంతేకాకుండా పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకునే పని కూడా తప్పుతుంది.

చీకట్లో కూడా పనిచేసే టెక్నాలజీ:

Advertisement

ముఖాన్ని స్కాన్ చేయడానికి కంపెనీలు ఇన్‌ఫ్రారెడ్ (IR) సెన్సార్లను వాడుతాయి. ఈ కెమెరా వల్ల లాభం ఏంటంటే.. చీకట్లో కూడా మన ముఖాన్ని స్కాన్ చేసి లాగిన్ అవ్వొచ్చు. భద్రతను మరింత పెంచడానికి 2025లో మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌డేట్ తెచ్చింది. దీనివల్ల ఇప్పుడు కలర్ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ రెండూ కలిపి ముఖాన్ని స్కాన్ చేస్తాయి. ఐఫోన్లలో పదేళ్లుగా ఫేస్ ఐడీ ఉన్నా.. యాపిల్ మ్యాక్‌బుక్స్‌లో మాత్రం ఈ ఫీచర్ ఇంకా రాకపోవడం గమనార్హం.

Tags

Related News

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ చూశారా?

గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!

కొత్త ఫోన్ కొనడానికి ముందు ఈ 5 విషయాలు చూడకపోతే నష్టపోవడం ఖాయం!

ఫోన్ కెమెరాలో HDR ఆన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!

Big Stories

Advertisement
×