E-Paper
Advertisement

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!
Advertisement

Youtuber Nandana: యూట్యూబర్ నందన గత కొద్దిరోజులుగా ఈమె పేరు మారు మోగిపోతుంది. ఈమె లండన్ లో నివసిస్తున్నప్పటికీ తన భర్త మధుకర్ తో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె ఇదే అదునుగా భావించి విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ డెస్టినీ కన్సల్టెన్సీ అనే పేరుతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్లు ఎంతో మంది బాధితులు ఈమెపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలకు లక్షలు డబ్బు తీసుకున్నారని ఆ బాధితులు ఆరోపణలు చేశారు.

మా జీవితాలలో కఠినమైన రోజులు..

ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలలో ఈమెపై కేసు నమోదు కావడంతో ఈమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇకపోతే ఇటీవల ఇండియా వచ్చిన నందనను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం ఈమెను విచారణకు కూడా పిలిచిన సంగతి తెలిసిందే. ఇలా ఈ విషయం గురించి యూట్యూబర్ నందన ఎక్కడ ఎలాంటి వీడియోలను విడుదల చేయలేదు అలాగే మీడియాతో కూడా ఈమె మాట్లాడలేదు కానీ తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నందు మాట్లాడుతూ.. అందరూ ఎలా ఉన్నారు మేము మా యూట్యూబ్ జర్నీ ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆరు సంవత్సరాలలో మేము మా కుటుంబం, మా పిల్లలు, మా సంతోషం, మా బాధలు అన్ని మీతో పంచుకున్నాము . మీ ప్రేమ ఆదరణల కారణంగా ఈ స్థాయికి వచ్చాం. ఇక గత కొద్దిరోజులుగా మా జీవితాలలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి అని ఈమె ఎమోషనల్ అయ్యారు.

నిజాలు ఏంటో చట్టం బయట పెడతుంది..

Advertisement

మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి, భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్నో అవమానాలను తట్టుకోవాల్సి వచ్చింది. 70 సంవత్సరాల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి ఎంతో బాధపడుతున్నారు. మా పిల్లలు కూడా ఈ విషయంలో బాధపడుతున్నారు. ఒక్కో మెట్టు ఎక్కి ఎంతో అద్భుతంగా నిర్మించుకున్న మా జీవితం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం చాలా బాధాకరం. సోషల్ మీడియా అనేది ఎవరిది తప్పు ఒప్పు అని నిర్ణయించేది కాదు ఆ బాధ్యత చట్టాన్నిదని నందన తెలిపారు. నిజా నిజాలు ఏంటి అనేది కోర్టు నుంచి తీర్పు రావాలని, చట్టంపై మాకు నమ్మకం ఉందని వాటి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

?stkn=bnpsbWFjeGgyMjg5

Advertisement

ఎన్నో బెదిరింపులు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయంలో మా తల్లిదండ్రులు మేము మానసికంగా ఎంతో ఒత్తిడిని అనుభవించాము. ఇబ్రహీంపట్నంలో కేసు హైకోర్టులో న్యాయం కోసం పిటిషన్ దాఖలు చేశామని అందుకే ఈ అంశం గురించి సోషల్ మీడియాలో ఎక్కడ ప్రస్తావించలేదని నందన తెలిపారు. ప్రతి ఒక్కరూ మా స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కానీ కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతే తాము ఈ విషయంపై మాట్లాడతామని తెలిపారు. శ్రీకృష్ణుడు వంటి భగవంతుడికి నింద తప్పలేదు. మేము సాధారణ మనుషులమే మా మీద పడ్డ నింద తొలగించుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది అంటూ నందన పేరుతో ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

Related News

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Big Stories

Advertisement
×