BigTV English
Advertisement

Hyper Aadi Satires on AP Govt: పిఠాపురం రోడ్ షో.. జగన్ సర్కార్‌పై హైపర్ ఆది పంచ్‌లు

Hyper Aadi Satires on AP Govt: పిఠాపురం రోడ్ షో.. జగన్ సర్కార్‌పై హైపర్ ఆది పంచ్‌లు

Hyper Aadi Satire on Jagan Government in Pithapuram Elections Campaign: ఆంధ్రపదేశ్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై మరొకరు పంచ్‌లు, సెటైర్లు విసురుకుంటున్నారు. ఇక అన్నింటికంటే ముందు చెప్పుకోదగిన నియోజకవర్గం పిఠాపురం. అందరికళ్లు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలతో పవన్‌కల్యాణ్ బిజీ అయిపోయారు. పవన్‌కు మద్దతుగా టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రచారం చేస్తున్నారు.


తాజాగా నాగబాబుతో కలిసి కమెడియన్ హైపర్ఆది రోడ్ షో నిర్వహించారు. హైపర్ఆది పంచ్‌లకు నార్మల్‌గా నవ్వు వస్తుంది.. అదే పబ్లిక్‌లో పంచ్‌లు వేస్తే ఓ రేంజ్‌లో ఉంటాయి. హైపర్ పంచులతో ఓటర్లతోపాటు రోడ్ షోలో ఉన్న నేతలు నవ్వులే నవ్వులు. కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి ప్రభుత్వాన్ని దూరంగా పెట్టాలన్నా ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నాడు. పవన్‌కు ఓటు వేసే అదృష్టం తనకు లేదన్నాడు హైపర్ ఆది.

మంచి జరిగితే ఓటు వేయాలని వైసీపీ సర్కార్ ప్రతి సభల్లోనూ  చెబుతోందని, వాళ్లింట్లోనే మంచి జరగక ఇద్దరు చెల్లెళ్లు రోడ్లపై తిరుగుతున్నారని తనదైన శైలిలో పంచ్‌లు విసిరాడు హైపర్ఆది. బటన్ నొక్కితే ఆడవాళ్లు అకౌంట్లో 10వేలు పడుతున్నాయని చెబుతున్నారని, సాయంత్రం మూత ఓపెన్ చేస్తే మగవాళ్ల అకౌంట్ నుంచి 30 వేలు పోతున్నాయని తనదైనశైలిలో చెప్పుకొచ్చాడు.


Also Read:  ఏపీ.. కంటైనర్లలో కరెన్సీ నోట్లు, 2,000 వేల కోట్లు..

తాను వస్తున్న దారిలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వడదెబ్బ తగిలి పడిపోయారని వార్తలు వస్తున్నాయిని గుర్తు చేశారు. గ్లాసు మీద ఓటు వేస్తే ఫ్యాన్ ఎగిరిపోవాలని కంక్లూజన్‌లో చెప్పుకొచ్చాడు. హైపర్‌ ఆది మాటలు విన్నవాళ్లు మాత్రం ఇలా హాయిగా నవ్వుకుని ఎన్ని రోజులైందని అక్కడి వచ్చినవాళ్లు చెప్పుకోవడం కొసమెరుపు.

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×