AP Local Body Election Result 2026: ఏపీలో కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. మురసు తుఫాను కారణంగా ప్రభావిత జిల్లాల్లో లెక్కింపు కాసింత ఆలస్యంగా మొదలు కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అక్కడి అధికారుల నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏపీలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కార్పొరేషన్ల కౌంటింగ్ కోసం 308 హాళ్లు, 4026 టేబుళ్ల ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. లెక్కింపునకు 24156 మంది సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 116 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కౌంటింగ్ కోసం 248 హాళ్లు, 2805 టేబుళ్ల ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల లెక్కింపు మొదలైంది. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు, ప్రతి ఓటును ఏజెంట్లకు చూపించిన తర్వాత ఏర్పాటు చేసిన ట్రేలలో వేయనున్నారు సిబ్బంది. మురసు తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలు మినహాయించి మిగిలిన చోట్ల ప్రారంభమైంది. వర్షం కారణంగా రెండు జిల్లాల్లో కొంత ఆలస్యంగా లెక్కింపు ప్రారంభిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర వెల్లడించారు.
ALSO READ: ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన