E-Paper
Advertisement

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?
Advertisement

Visakhapatnam: విశాఖపట్నం సిటీలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌-హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో పేలుడు చోటు చేసుకుంది. ఫలితంతా రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్‌ సేఫ్టీ వింగ్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

రాత్రి విశాఖ హెచ్‌పీసీఎల్‌లో పేలుడు, ఎగిసిపడిన మంటలు

విశాఖ సిటీలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం రాత్రి సుమారు 10.15 గంటలకు మల్కాపురంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL రిఫైనరీ సల్ఫర్ పిచ్‌ వేస్ట్ మెటీరియల్‌లో పేలుడు జరిగింది. విద్యుత్ తీగ కారణంగా మంటలు చెలరేగి పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. రిఫైనరీ‌లో థార్‌ పిచ్‌ యూనిట్‌లో సల్ఫర్‌ ట్యాంకుల అడుగున చమురు ట్యాంకు ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీని కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది, ఘటనపై విచారణ మొదలు

Advertisement

ఘటన విషయం తెలియగానే కంపెనీల ఫైరింజన్లు, చుట్టుపక్కల ఉండే కంపెనీల ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. తొలుత రోజు వారీగా రిఫైనరీ నుంచి వచ్చే మంటలని చాలామంది భావించారు. మంటలు చిన్నగా మొదలై ఆ తర్వాత తీవ్రం కావడంతో ప్రమాదం జరిగిందని అనుకున్నారు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి హెచ్‌పిసిఎల్ ఫైర్ టెండర్లను మోహరించినట్లు ఫ్యాక్టరీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. గంటల వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతుండటంతో ప్రజలలో ఆందోళన నెలకొంది.

ALSO READ: మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

Advertisement

నల్లటి పొగలు శ్రీహరిపురం, మల్కాపురం ప్రాంతాలను కమ్మేసింది. ఈ క్రమంలో ఏదో జరుగుతోందని భావించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కంపెనీ నుంచి ఎలాంటి సైరన్లు మోగించలేదని వాపోయారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మల్కాపురం పోలీసులు తెలిపారు. హెచ్‌పీసీఎల్ పక్కనే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఆయిల్‌ టెర్మినల్‌ యాజమాన్యం భద్రత చర్యలు చేపట్టింది. మొత్తానికి అర్ధరాత్రి తర్వాత మంటల తీవ్రత క్రమంగా తగ్గడంతో అధికారులతోపాటు స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రిఫైనరీ నుంచి ఏటా 15 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధి చేస్తుంది. గడిచిన 25 ఏళ్లలో దీని సామర్థ్యం రెట్టింపు అయ్యింది. దశాబ్దం కిందట అంటే 2013 లో రిఫైనరీలో కూలింగ్ టవర్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు మరణించిన విషయం తెల్సిందే. విశాఖలో ఉన్న ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం 1957 లో ప్రారంభించబడింది. దేశంలోని తూర్పు తీరంలోని అతి పురాతన, అతిపెద్ద శుద్ధి కర్మాగారాలలో ఇది ఒకటి.

 

Related News

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన

మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ఈడీ మెరుపు దాడులు.. రూ. 1,500 కోట్ల భారీ మనీలాండరింగ్ గుట్టురట్టు!

కర్నూలు మేయర్ పీఠంపై ఉత్కంఠ.. పక్కా గెలుస్తామంటూ జోరుగా బెట్టింగ్..?

రాప్తాడు బాధితురాలిని పరామర్శించిన జగన్.. కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్!

సౌత్ బిహార్‌లా ఏపీ.. రీ-పోలింగ్ పెట్టాల్సిందే.. వైఎస్ షర్మిల సంచలన డిమాండ్!

విజయసాయిరెడ్డి పార్టీలోకి టీడీపీ నేత రమణ, ఈనెల 11న చేరిక, వైసీపీ నుంచి రెడీగా ఉన్నారా?

Big Stories

Advertisement
×