E-Paper
Advertisement

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన
Advertisement

Cyclone Murasu: ఏపీని వరుస తుఫాన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారంలో రెండు తుఫాన్లు బీభత్సం చేశాయి. అర్నబ్‌కు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలను డ్యామేజ్ అయ్యాయి. మురసు దాటికి దక్షిణ కోస్తా, రాయలసీమను అల్లకల్లోలం చేశాయి. రెండు తుఫాన్లు ఒకేవారంలో రావడంతో ప్రజలు, అధికారులకు మింగుడుపడడంతో లేదు. తాజాగా మురసు తుఫాన్ మంగళవారం ఉదయం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం మధ్య తీరాన్ని దాటింది. దీని కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్

ఏపీలో తీరం దాటింది తీవ్ర తుఫాను మురసు. నెల్లూరు-ఒంగోలు మధ్య తీరం దాటినట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలులోని కొత్తపట్నం వద్ద తీరం దాటింది. మురసు తీవ్ర తుపాను ఉత్తర – వాయవ్య దిశగా పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మురసు తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీశాయి. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు వేగంతో గాలులు వీశాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 198 మి.మీటర్లు వర్షపాతం నమోదు అయ్యిందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒంగోలులోకి కొత్తపట్నం వద్ద తీరం దాటిన మురసు

Advertisement

మురసు తుఫాను నేపథ్యంలో సోమవారం నుంచి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అర్ధరాత్రి వర్షాలకు తోడు బలమైన గాలులు తీవ్రమయ్యాయి. మంగళవారం అంతా ఉమ్మడి నెల్లూరు మొదలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేశాయి. అర్నబ్ స్థాయిలో నష్టం కలిగించనప్పటికీ, భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. తుఫాను పరిస్థితిని ముందుగానే గమనించిన అధికారులు, వివిధ జిల్లాల్లో రెండురోజులపాట సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభావాన్ని ఆర్టీసీఎస్-విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉంది.

ALSO READ: విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?

Advertisement

అర్నబ్‌తో పోల్చితే మురసు వల్ల నష్ట తీవ్రత తక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తీరం దాటే సమయంలో గాలులు బీభత్సం చేసినట్టు వివరించారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఉభయగోదావరి జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంబాలు పడినట్టు తెలిపారు. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగానే కొనసాగుతుందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో 198.01 మి.మీ, కొత్తపట్నం-182.25 మిమీ, బాపట్ల-128.53 మి.మీ, చీరాల-124.10 మి.మీ,  ప్రకాశం జిల్లాలో త్రోవగుంట-116.93 మి.మీ, ఒంగోలు అర్బన్-106.97 మి.మీటర్లు నమోదు అయ్యింది.

Related News

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?

మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ఈడీ మెరుపు దాడులు.. రూ. 1,500 కోట్ల భారీ మనీలాండరింగ్ గుట్టురట్టు!

కర్నూలు మేయర్ పీఠంపై ఉత్కంఠ.. పక్కా గెలుస్తామంటూ జోరుగా బెట్టింగ్..?

రాప్తాడు బాధితురాలిని పరామర్శించిన జగన్.. కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్!

సౌత్ బిహార్‌లా ఏపీ.. రీ-పోలింగ్ పెట్టాల్సిందే.. వైఎస్ షర్మిల సంచలన డిమాండ్!

విజయసాయిరెడ్డి పార్టీలోకి టీడీపీ నేత రమణ, ఈనెల 11న చేరిక, వైసీపీ నుంచి రెడీగా ఉన్నారా?

Big Stories

Advertisement
×