YS Jagan: ఇటీవల రాప్తాడులో చోటుచేసుకున్న సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన జగన్.. రాష్ట్రంలో విచ్చలవిడిగా మారిన వైన్ షాపులు, గంజాయి సంస్కృతి వల్లే ఇలాంటి ఘాతుకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
రూ.50 లక్షల పరిహారం డిమాండ్..
ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం వెంటనే రూ.50 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఈ సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు బెల్ట్ షాపులు, గంజాయే కారణం: వైఎస్ జగన్
రాష్ట్రంలో బెల్ట్ షాపులు, గంజాయి, మద్యం విచ్చలవిడిగా పెరిగిపోవడమే ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇవి అందుబాటులోకి రావడంతో యువత బానిసలుగా మారి అనర్థాలు… pic.twitter.com/mk444dw0T5
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2026
బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి: వైఎస్ జగన్
రాప్తాడు బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం వెంటనే చెల్లించాలని వై0సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సహాయం చేయకపోతే, తమ ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో ఆ మొత్తాన్ని అందిస్తామని, వైద్యపరంగా… pic.twitter.com/HJ5tktSQnq
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2026
రూ.3 లక్షల సాయం
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలి వైద్యానికి వేగంగా చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.లక్ష సాయం ప్రకటించగా.. అనంతపురం సర్వజన ఆస్పత్రి నిధుల నుంచి మరో రూ.2 లక్షలను మణిపాల్ ఆస్పత్రికి విడుదల చేశారు. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక గోపిక ఆరోగ్యం క్రమంగా నిలకడగా మారుతోందని వైద్యులు తెలిపారు.
Also Read: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగలు తగిలి 8 మంది కార్మికులు బలి