E-Paper
Advertisement

ఆంధ్ర-ఒడిశా వైపు.. తుఫాన్, ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటనుందంటే?

ఆంధ్ర-ఒడిశా వైపు.. తుఫాన్, ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటనుందంటే?
Advertisement

Cyclone Aqwan: ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న సైక్లోన్ అక్వాన్, ఉత్తర-వాయువ్య దిశగా కదలడం ప్రారంభించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో ఆంధ్ర – ఒడిశా సరిహద్దు సమీపంలోని ఇచ్ఛాపురం – బరంపురం బెల్ట్‌ వద్దకు అతి దగ్గరగా వచ్చి అతి బలహీన వాయుగుండం లేదా అల్పపీడనంగా ఎర్పడి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అన్నారు.

ఈ జిల్లాలో భారీ వర్షాలు..

దీంతో నేడు, రేపు శ్రీకాకుళం నగరం నుండి చిలక సరస్సు వరకు ఉన్న సరిహద్దు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా విశాఖపట్నం, విజయనగరం నగరాలు మరియు సమీప ప్రాంతాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వాయుగుండం కారణంగా మిగిలిన ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఉంటుందని, చల్లని రాత్రులు, పొగమంచుతో కూడిన ఉదయాలను ఆస్వాదించవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఆక్వాన్ తుఫాన్..

Advertisement

ఇప్పటికే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఆక్వాన్ తుఫాన్ ప్రభావం మొదలైంది. దీంతో రాష్ట్రంలో పూర్తిగా వాతావరణం ఇప్పటికే మారిపోయిది. చాలా మండలాల్లో చిరుజల్లులతో కూడిన వాన పడుతుంది. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రజలను అప్రమత్తం చేసింది. ఈరోజుతో పాటు మరో రెండు రోజులు పాటు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

హెచ్చరికలు జారీ..

రాష్ట్రంలో ఇప్టటికే ఉమ్మడి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి జిల్లాల యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది. నిన్నటి నుంచి వీస్తున్న ఎదురుగాలులతో చెట్ల కిందకు, శిధిలావస్థ భవనాల వద్దకు వెళ్లొద్దని ఉమ్మడి జిల్లా ప్రజలకు అధికారులు హెచ్చరికలను జారీ చేసారు. ఒడిస్సా – శ్రీకాకుళం మధ్య అక్వాన్ తీరం దాటనుండడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరఫ నిపునులు తెలిపారు.

Advertisement

Also read: బోత్స అనూష పిటిషన్‌పై.. హైకోర్టు సంచలన తీర్పు..!

Tags

Related News

బోత్స అనూష పిటిషన్‌పై.. హైకోర్టు సంచలన తీర్పు..!

ఏపీలో జెడ్పీ పీఠాల పంపకాలు.. కొనసాగుతున్న ఉత్కంఠ, సీఎం చంద్రబాబుతో మరోమారు చర్చలు

ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు

ఏపీకి బిగ్ రిలీఫ్.. అక్వాన్ తుపాను ముప్పు తప్పినా.. ఆ ఆరు జిల్లాలకు వాన గండం!

భార్యకు సర్పంచ్‌గా అవకాశం దక్కలేదని భర్త ఆత్మహత్య!

ఆ రెండింటి మధ్య తేడా నీకు తెలీదా.. జగన్ పై నారా లోకేష్ సెటైర్లు!

రామోజీ జయంతి జీవో వివాదం.. సీఎం చంద్రబాబుకు అంబటి చురకలు!

Big Stories

Advertisement
×