E-Paper
Advertisement

నాగదుర్గ ఊచకోత.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

నాగదుర్గ ఊచకోత.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!
Advertisement

Lagare Sound Saala:ఫోక్ సాంగ్స్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే వీటికి అధ్బుతమైన గొంతులు ,వాటికి మరిన్ని మాంచి మాస్ బీట్స్ కలిసి ఈ ఫోక్ సాంగ్స్ రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాయి.ముఖ్యంగా ఈ పాటల్లో కనిపించే పల్లెటూరి వాసనలు,మట్టి పరిమళాలే మూజిక్ లవర్స్ కి మాంచి కిక్కిస్తున్నాయని పాటలకి వస్తున్న అప్లాజ్ చూస్తే అర్థమవుతుంది.

ఇక తాజాగా అదే కోవలో ఇపుడు మరో పాట వచ్చి ఇపుడు నెట్టింటిని ఒక ఊపు ఊపేస్తుంది.అదే లగారే సౌండ్ సాలా..దంచి కొట్టు డిజే వాలా’.నాగ దుర్గ లీడ్ రోల్ చేసిన ఈ పాట వచ్చిన 5 నెలల్లోనే ఏకంగా 50 మిలియన్లకి చేరువైందంటే పాటని ఆడియన్స్ ఎంతలా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది.

Advertisement

పాట విషయానికి వస్తే

ఈ’ లగారే సౌండ్ సాలా..దంచి కొట్టు డిజే వాలా’ పాట విషయానికి వస్తే ఆడపిల్ల సిగ్గు పడకుండా అందరిలో కలిసిపోవాలంటూ , అంతకు మించి ఎదిగిపోవాలంటూ పెళ్లి బరాత్ నేపథ్యంగా తీసిన ఈ పాట ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది.ఇక చివరిలో పెళ్లి కూతురు వెళ్ళిపోయి తిరిగి పరిగెత్తుకుంటూ రావడం కూడా చూసేవాళ్ళని కదిలిస్తుంది.ఇక సినిమా రేంజ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ పాటకి బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.

Advertisement

ALSO READ:‘బాసింగ బలాలు’తర్వాత వైష్ణవీ సోనీ మరో సెన్సేషన్..తగ్గట్లేదుగా!

ఇక ఈ పాటకి అధ్బుతమైన,అర్థవంతమైన లిరిక్స్ ని అందించి ఈ జానపదాన్ని మరో మెట్టు ఎక్కించాడు బుల్లెట్ బండి లక్ష్మణ్. ఇక ఇదే లక్ష్మణ్ అబ్బాయి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి నేపథ్యంగా వచ్చిన బుల్లెట్టు బండి అనే పాటని రాసిన సంగతి తెల్సిందే.

ఇక ఈ పాటకి వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్న మదీన్ sk సంగీతం అందించగా ఎన్నో సాలిడ్ హిట్ ఫోక్ సాంగ్స్ పాడిన మమత రమేష్ ఈ ఫోక్ సాంగ్ ని కూడా పాడటం విశేషం.ముఖ్యంగా తన గొంతులో పలికే మాస్ ఫీల్ పాటకి కొత్త జోష్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక అప్పగింతలు, మోకల్లె అరిగిన మానాయనే ,బావో బంగారం ,పేరు గళ్ళ పెద్ది రెడ్డి వంటి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని పాటలని మమత రమేష్ పాడిందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి, ఫోక్ ఇండస్ట్రీలో నాగ దుర్గ

ఇక నెట్టింటిని షేక్ చేస్తున్న ఈ పాటకి తమదైన శిలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు,ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి, ఫోక్ ఇండస్ట్రీలో నాగ దుర్గని కొట్టేవారు లేరంటూ నాగ దుర్గని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఇక మరికొందరు నాగ దుర్గ చేసే పాటల్లో అసలు ఒక్క అబ్బాయి కూడా ఉండడు,పాటని కూడా చాలా పద్దతిగా చూడముచ్చటగా చేస్తుంది అంటూ మెచ్చుకుంటున్నారు.

మొత్తానికి ఐయాం ద ఫోక్ క్వీన్ అని ఈ లగారే సౌండ్ సాలా..దంచి కొట్టు డిజే వాలా’ పాటతో నాగ దుర్గ మరోసారి ప్రూవ్ చేసుకుందనే చెప్పాలి. చూడాలి మరి ముందు ముందు ఈ పాట ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

ALSO READ:నాగవ్వ పల్లె గొంతు.. మధుప్రియ మాస్ వాయిస్.. కట్ చేస్తే మిలియన్ల వ్యూస్

Tags

Related News

నిర్ణయం తీసుకోలేని వారు విజేత ఎలా అవుతారు.. ముఖేష్, త్రిగుణ్ పై నెటిజన్స్ ఫైర్!

గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న టాప్ కంటెస్టెంట్.. ఎవరంటే?

హౌస్ నుండి రామకృష్ణ కిడ్నాప్.. అసలేం జరుగుతోంది?

Illu Illaalu Pillalu Vedavathi : సీరియల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వేదవతి అవుట్..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మీనా హ్యాపీ.. మందు కొట్టిన మగాళ్లు.. బాలు, మీనా గొడవ..

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..

Brahmamudi Serial Today Episode November 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందుల శోభనం రేఖ ఆపేస్తుందా..? 

Big Stories

Advertisement
×