YSRCP Petition: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక వివరాల్లోకి వెలితే.. గతంలో వైసీపీ పార్టీ నామినేషన్ గడువు పెంచాలన్ని పిటీషన్ వేసింది. దీంతో వైసీపీ వేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల వాయిదా కోసం ప్రయత్నిస్తే మేము అంగీకరించబోమని సీజేఐ ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది.
అయితే ఎన్నికలను వాయిదా వేయాలన్న మీ ట్రాప్‌లో మేము పడబోమని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో నామినేషన్ల గడువు ముగిసినందున ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ పిటీషన్ పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
దీంతో వైసీపీ పార్టీ వేసిన నామినేషన్ల గడువు పొడిగింపుపై విచారణ సుప్రీం కోర్టు ముగింపు చేసింది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో ముందుకే వెళ్లాలని స్పష్టమైన సంకేతాలను సుప్రీం కోర్టు ఇచ్చింది. దీంతో నామినేషన్ల గడువు పెంచాలన్న వాదనను తోసి పుచ్చడంతో వైసీపీ పార్టీకి ఇదో షాకింగ్ న్యూస్‌లా మిగిల్చింది.
Also read: నవ్వినా అవుట్… భయపడినా అవుట్… హాలోవీన్ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ