Big Stories

AP Cyclone: ముంచెత్తిన వాన.. తుపాను తఢాకా.. సీఎం రివ్యూ..

AP Cyclone: తుపాను తీరం దాటింది. వాన వెల్లువెత్తింది. పలు ప్రాంతాలు వాన బీభత్సానికి కకావికలం అయ్యాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లోనూ వాన పడుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తుతోంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి.

- Advertisement -

మాండౌస్ తుపాను తమిళనాడులోని మహాబలిపురం దగ్గర అర్థరాత్రి తీరాన్ని దాటింది. అనంతరం అది తీవ్ర వాయుగుండం.. వాయుగుండంగా బలహీనపడింది. తుపాను తీరం దాటినప్పటికీ ఆదివారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.

- Advertisement -

భారీ వర్షంతో తిరుమలలో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్ల మార్గంలో వరద వచ్చి చేరుతుండటంతో కాలినడక మార్గాన్ని తాత్కాలికంగా మూసేశారు టీటీడీ అధికారులు.

శ్రీకాళహస్తి దగ్గర స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాలంగి రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కేవీబీపురం మండలం రాజులకండ్రిగ దగ్గర కాజ్‌వే కొట్టుకుపోయింది.

మరోవైపు, తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే పునరావాస శిబిరాలను తెరవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News