E-Paper
Advertisement

Pawan Kalyan : పవ‌న్ – హ‌రీష్ సినిమా.. రంగంలోకి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌

Pawan Kalyan : పవ‌న్ – హ‌రీష్ సినిమా.. రంగంలోకి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ సినిమా అంటే సినీ ఇండ‌స్ట్రీలో తెలియ‌ని క్రేజ నెల‌కొంది. అందుకు కార‌ణం వీరిద్ద‌రి కాంబోలో ఇంత‌కు ముందు వ‌చ్చిన గబ్బ‌ర్ సింగ్ ఇండ‌స్ట్రీ హిట్ కావ‌ట‌మే. దాదాపు ప‌న్నెండేళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ మ‌రోసారి చేతులు క‌లుపుతున్నారు. ప‌వ‌న్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కిస్తున్నారు. అందులో హ‌రీష్ శంక‌ర్ సినిమా ఒటి. అయితే ఇప్ప‌టికే వీరి కాంబోలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో త‌మిళ చిత్రం తెరి రీమేక్‌ను వీరు చేయ‌బోతున్నార‌నే వార్త సాధార‌ణ ప్రేక్ష‌కులకే కాదు.. హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కూడా మింగుడుప‌డ‌లేదు. దీంతో హ‌రీష్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు.

ఈ క్ర‌మంలో హ‌రీష్ శంక‌ర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేయ‌బోతున్న త‌న సినిమా గురించి మ‌రో క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు. ఈ సినిమాకు మ‌రో డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నార‌ట‌. ఆయ‌నెవ‌రో కాదు.. సంతోషం, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ వంటి హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ దశ‌ర‌థ్‌. అయితే హరీష్ రీమేక్ సినిమా చేయ‌బోతున్నాడా.. లేక స్ట్ర‌యిట్ సినిమా చేయ‌బోతున్నాడా? అనేది మాత్రం చెప్ప‌లేదు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×