BigTV English

Puri Jagannadh : చాలా గ్యాప్ తరువాత “పూరీ మ్యూజింగ్స్” తడ్కా..

Puri Jagannadh : చాలా గ్యాప్ తరువాత “పూరీ మ్యూజింగ్స్” తడ్కా..

Puri Jagannadh : లైగర్ ఫ్లాప్ తరువాత పూరీ జగన్నాధ్ మీడియా ముందుకు రావడం తగ్గిపోయింది. పూరీ మ్యూజింగ్స్, పూరీ పోడ్‌కాస్ట్స్‌లకు కూడా కొంత కాలం బ్రేక్ పడిండి. పూరీ జగన్నాధ్ మళ్లీ తాజాగా పూరీ మ్యూజింగ్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ సారి తడ్కా టాపిక్ పై పోడ్‌కాస్ట్ ఇచ్చారు డైనమిక్ డైరెక్టర్.


తడ్కా గురించి పూరీ జగన్నాధ్ పూరీ మ్యూజింగ్స్‌లో చెబుతూ.. తడ్కా అంటే తాలింపు అన్ని విషయం మనకు తెలుసు.. మనం ఓ వ్యక్తిని పని కోసం ఒకరి దగ్గరికి పంపిస్తాం.. అతని దగ్గరికి వెళ్లినా తరువాత పని వద్దని మళ్లీ తిరిగి వస్తాడు.

ఏమైంది.. ఎందుకు తిరిగివచ్చావని ఆ వ్యక్తిని అడిగితే. వాడు చాలా వరస్ట్.. డబ్బులెక్కువయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. మీరైతే లాగి కొట్టేవారు అని అంటాడు. అసలేమైందని ఆ వ్యక్తిని అడిగితే. అప్పుడు సమాధానంగా..”డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు” అని చెబుతాడు. ఈ విషయాన్నే ఉదాహరణగా పూరీ చెబుతారు.


మనం ఏ విషయాన్ని ఇంకొకరికి సరిగ్గా చెప్పం. మసాలాలు, తడ్కా, స్పైసెస్ వేసి అన్న దాన్ని కొంత మార్చి చెబుతాం. మధ్యవర్తులు అసలు విషయాన్ని చెప్పక తడ్కా(తాలింపు) చేస్తారు. మధ్యవర్తులంటే ఎవరో కాదు మనమే అని అంటారు పూరీ జగన్నాద్. జీవితంలో సగం గొడవలకు ఈ తడ్కానే కారణమని అంటారు పూరీ జగన్నాధ్. ఏ విషయాన్ని ఎవ్వరూ ఉన్నది ఉన్నట్లు చెప్పరు. ఎవరైనా ఏ విషయమైనా అడిగితే ఉన్నది ఉన్నట్లు చెప్పండే. తడ్కా చేయకండి. జీవితంలో మనం తడ్కాను తగ్గిద్దాం అని పూరీ జగన్నాద్ ఈ తడ్కా పోడ్‌కాస్ట్‌ను ముగిస్తారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×