E-Paper
Advertisement

దూసుకొస్తున్న మురసు తుఫాను.. దక్షిణ ఏపీ వైపు చూపు, తెలంగాణలో భారీ వర్ష సూచన

దూసుకొస్తున్న మురసు తుఫాను.. దక్షిణ ఏపీ వైపు చూపు, తెలంగాణలో భారీ వర్ష సూచన
Advertisement

Cyclone Murasu: అర్నబ్ తుఫానుతో అతులాకుతలమైన ఉత్తరాంధ్ర-కోస్తా జిల్లాలకు మురుసు ముప్పు తొలిగింది. కాకపోతే దక్షిణ ఏపీ వైపు ఫోకస్ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా టర్న్ అయ్యింది. దీని కారణంగా ఏపీ, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.

ఏపీ-తమిళనాడు-తెలంగాణ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాను ఏపీ-తమిళనాడు వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుపానుగా బలపడిన మురసు, ప్రస్తుతం చెన్నైకి 260 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 23కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతోంది. నెల్లూరుకు 290 కి.మీ, మ‌చిలీప‌ట్నానికి 320 కి.మీ, కావలికు 310 కి.మీ, ఒంగోలుకు 330 కి.మీ,విశాఖ‌కు 470 కి.మీ ఉంది. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి సోమవారం అర్ధరాత్రి లేకుంటే మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్

Advertisement

ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి మురసు అని పేరు పెట్టారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తీరం దాటే సమయంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలపై మురసు ప్రభావం చూపనుందని అంచనా వేసింది. సోమ-మంగళవారాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మురసు తీరం దాటిన తర్వాత హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ మీదుగా మహారాష్ట్ర వైపు పయనించే అవకాశముందని భావిస్తోంది ఐఎండీ.

మంగళవారం ఉదయానికి తుపానుగా మారి నాలుగు తేదీ నాటికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు పేర్కొంది. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కృష్ణా నుంచి నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. వివిధ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి విశాఖ, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Advertisement

ALSO READ: రాప్తాడు రాక్షసుడిపై పోలీసులు కాల్పులు? నిందితుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?

మురసు తుఫాన్ కారణంగా తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఈ తుఫాను తీరం దాటిన నుంచి గురువారం వరకు తెలంగాణ జిల్లాల వరకు ఈ తుపాను ప్రయాణించవచ్చని భావిస్తోంది. సోమవారం ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది వాతావరణం కేంద్రం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, భువనగిరి, జనగామ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉందని తెలిపింది.

Related News

రాప్తాడు రాక్షసుడిపై పోలీసులు కాల్పులు? నిందితుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?

జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ క్లోస్.. విశాఖ మేయర్ పీఠం దక్కేది ఎవరికి..?

వైఎస్ జగన్ పై.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్!

బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి లోకేష్.. రాప్తాడు దాడి బాధితురాలికి పరామర్శ

‘గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు..’ స్థానిక పోలింగ్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో తయారైన తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ముంబైకి రవాణా!

తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను గండం.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!

Big Stories

Advertisement
×