E-Paper
Advertisement

రాప్తాడు రాక్షసుడిపై పోలీసులు కాల్పులు? నిందితుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?

రాప్తాడు రాక్షసుడిపై పోలీసులు కాల్పులు? నిందితుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?
Advertisement

Rapthadu Attack: ఆంధ్రప్రదేశ్‌లో రాప్తాడు హైస్కూల్‌లో అమ్మాయి పై దాడి చేసిన దుండగుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్టుగా సమారం. నిందితుడిని పోలీసులు పట్టుకుని తీసుకువస్తున్న సమయంలో తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు హేమంత్‌కు బుల్లెట్ తగిలి తీవ్ర గాయాలవగా అతడిని పోలీసులు ఆసుపత్రి‌కి తరలించారు. రాప్తాడు హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ విద్యార్థి గోపిక పై రంపంతో హేమంత్ అనే యువకుడు హత్యాయత్నం చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే..

ఆత్మకూరు అటవీ ప్రాంతం.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్ అనే యువకుడిని పై ఏపీ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను పోలీసులు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో జరిపారు. అయితే నిందితుడు అక్కడ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో వారినుండి పారిపోడానికి హేమంత్ ప్రయత్నించాడు. దీంతో పోలీసులు హేమంత్ పై 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువకుడికి తీవ్రగాయాలైనట్టు సమాచారం.

ఎలక్ట్రిక్‌ రంపంతో..

Advertisement

రాప్తాడు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గోపిక అనే విద్యార్థిని రాప్తాడు జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. అయితే హేమంత్ ఓక్కసారిగా ఎలక్ట్రిక్‌ రంపంతో లోపలికి ప్రవేశించి బాలికపై విచక్షణారహితంగా దాడి చేసాడు. ఈ దాడిలో15 ఏళ్ల బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను తరగతి గదిలోని పిల్లలందరూ చూసి భయాందోళనకు గురయ్యారు. కేవలం లక్ష్మీ అనే విద్యార్థి మాత్రం ధైర్యం చేసి దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో అడ్డుకున్న విద్యార్థికి సైతం తన రెండు కాల్లకు గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని అక్కడి స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగ బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Also read: తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

 

Tags

Related News

జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ క్లోస్.. విశాఖ మేయర్ పీఠం దక్కేది ఎవరికి..?

వైఎస్ జగన్ పై.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్!

బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి లోకేష్.. రాప్తాడు దాడి బాధితురాలికి పరామర్శ

‘గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు..’ స్థానిక పోలింగ్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో తయారైన తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ముంబైకి రవాణా!

తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను గండం.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!

మీడియా ముందు అదే తడబాటు.. దశాబ్దాల పులివెందుల కోటలో ప్రత్యర్థి జెండా?ఓటమిని జగన్ ఒప్పేసుకున్నారా?

Big Stories

Advertisement
×