Pulivendula Elections: రాష్ట్రంలో 92 మున్సిపాలిటీలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిషాయి. ప్రజలు చాలా రోజుల తర్వాత స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. పులివెందులలో ఏదో జరిగిపోయిందని జగన్ ప్రచారం చేస్తున్నారని అని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే పునాదులు కదులుతాయని భయం పట్టుకుందని అన్నారు.
పులివెందుల ప్రజలు పండగలా ఓటు వేశారని అన్నారు. రావడం రావడమే రాజకీయం చేశారు ఒకప్పుడు ఎదురుపడాలంటే భయపడే వ్యక్తులు.. ఇప్పుడు ఎదురు వెళ్ళి ప్రశ్నిస్తున్నారని అన్నారు. పులివెందులకే ఎందుకు జాతీయ మీడియా తీసుకొచ్చారు. ప్రజలు జగన్ మీద తిరగబడి ఓటు వేయడానికి వచ్చారని అన్నారు. జగన్ 2024లో చొక్కా మడత పెడతా అన్నారు.. ప్రజలు ఆయన కుర్చీని మడతపెట్టారని అన్నారు. ఇప్పుడు పులివెందులలో కూడా మడతపెడతారని అన్నారు.
జగన్ డెమోక్రసీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం.. మీ హయాంలో ఎన్నికలు జరిగాయా.. వైసీపీ నేతలు ఏజెంట్ గా కూర్చొనే పరిస్థితి చంద్రబాబు కల్పించారని అన్నారు. ఏ రకంగా ఎన్నికలు ఆపుతారో చెప్పండి.. నామినేషన్లు, ప్రచారం అన్నీ పులివెందులలో స్వేచ్ఛగా జరిగాయని అన్నారు. సీమలో ఘటనలను ఘటనగానే చూడకూడదు.. దానికి చారిత్రాత్మక నేపథ్యం చూడాలని రాజశేఖరరెడ్డి చెప్పారు. ఈ రోజు పులివెందులలో జగన్‌ను ప్రశ్నించిన ఘటన చారిత్రక నేపథ్యం చూడాలని అన్నారు. పులివెందుల మార్పు నాలుగు దశాబ్దాల ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మార్పు అని అన్నారు. మీరే ఓటు వేయలేదు.. మీకు డెమోక్రసీ పై ఉన్న నమ్మకం ఏంటరి ప్రశ్నించారు.
Also Read: ఆరోగ్యానికి ఆరోగ్యం,రుచికి రుచి..పర్ఫెక్ట్ సొర పిట్టు రెసిపీ!