Plane Crashed: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బిజినెస్ జెట్ రోడ్డుపై కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. ప్రమాదానికి గురైన విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్ నుండి బహమాస్‌కు వెళ్తోంది. ఈ ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు మొదలుపెట్టింది. అసలు ఘటన ఎలా జరిగింది?
ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో ఓ బిజినెస్ విమానం కూలిపోయింది. ప్రమాదం సమయంలో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. లీర్‌జెట్ 60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్ నుండి బహమాస్‌కు వెళ్తోంది. విమానం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ వద్దకు రాగానే ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది.
భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో విమానం కాలిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగో నివాసానికి సుమారు 14.4 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమాన ప్రకారం.. ఫ్లోరిడాలోని క్రెస్ట్‌హేవన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 12. 50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటన గురించి తెలియగాన సహాయక బృందాలు అక్కడికి చేరాయి. అప్పటికే విమానంలోని అందరు మృతి చెందారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ టీమ్‌ని పంపింది. విమానం నేలను తాకిన వెంటనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. అది ఇళ్లను ఢీ కొట్టకుండా రద్దీగా ఉండే రహదారిపై కూలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ఆ రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆస్టిన్- బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి జిమ్ రేనాల్డ్స్ ఈ ఘటనపై నోరు విప్పారు.
అది ప్రైవేట్ విమానమని, భారీ విషాదంగా చెప్పారు. ఆ విమానం కూలిన సమయంలో జాతీయరహదారిపై వెళ్తున్న సమయంలో కారులో ఉన్నవారు దాన్ని చిత్రీకరించారని తెలిపారు. విమానం ఆకాశం నుండి వేగంగా కిందపడటం, ఆ తర్వాత రోడ్డును ఢీ కొని పేలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కూలిన విమానం.. ఇళ్లకు కేవలం కొన్ని అడుగుల దూరంలో పడింది. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. సమీపంలోని ఇళ్లకు ఏమైనా నష్టం జరిగిందో లేదో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ALSO READ: పుట్‌బాల్ గేమ్ తర్వాత.. స్టేడియంలో కాల్పులు కలకలం, అమెరికాలో షాకింగ్ ఘటన
ఈ ఘటన జరిగిన వెంటనే పామ్ బీచ్ కౌంటీ సమీపంలోని రహదారికి ఇరువైపులా మూసివేశారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన రెండో అత్యంత ఘోరమైన ప్రమాదం. విమానంలో ఉన్న తొమ్మిది మందిని అధికారులు ఇంకా గుర్తించలేదు. వారిలో ప్రయాణికులు, సిబ్బంది ఎంత ఉన్నారో కూడా వెల్లడించలేదు. లీర్‌జెట్ 60 (N722BD) విమానానికి రెండు ఇంజన్లు ఉంటాయి. సుమారు 4,400 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
🚨 🇺🇸 #ÚLTIMAHORA | Avión privado se estrella en #Florida y provoca una fuerte explosión e incendio; una vivienda móvil fue alcanzada.
El accidente ocurrió poco después de la 1:00 de la tarde en #Greenacres, condado de #PalmBeach. La aeronave cayó junto a Military Trail, donde… pic.twitter.com/XqkRm1vBHV
— Michelle Rivera (@michelleriveraa) November 1, 2026
Thousands of people watched the video of the Florida jet crash and asked the same thing: where’s the plane?
Here’s why you can’t see it:
• It fell almost straight down. Unofficial flight tracking shows the Learjet dropped from over 35,000 feet nearly vertical, possibly at… https://t.co/n6acc0luOz pic.twitter.com/VYJtERnMTs
— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) November 1, 2026