GVMC Elections: విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. నగర పాలక పీఠాన్ని దక్కించుకు నేందుకు అధికార కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. 120 వార్డుల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొనగా కార్పొరేటర్ స్థానాల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. అయితే నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ప్రారంభంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడం రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేసింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సమయం గడిచేకొద్దీ కొంత పుంజుకున్న పోలింగ్ విషెస్ సమయానికి 50 శాతం నుంచి ఓట్లు పోల్ కాలేదని తెలుస్తుంది.
విశాఖ నగర పాలక పీఠంపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. 2026 జీవీఎంసీ ఎన్నికలు అధికార కూటమికి, వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగడంతో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. మొత్తం 120 వార్డుల్లో కార్పొరేటర్ స్థానాల కోసం 573 మంది అభ్యర్థులు పోటీపడగా మేయర్ పదవి కోసం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యంగా కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి, వైసీపీ తరఫున వరుడు కల్యాణి మధ్య పోటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే విశాఖ నగర ఓటర్లు ఓటు వేసేందుకు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉదయం తొమ్మిది గంటల వరకు కేవలం 3.34 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. తర్వాత ఉదయం 11 గంటలకు 13.34 శాతానికి చేరింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 27.55 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18 లక్షల 37 వేల 901 మంది ఓటర్లకుకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్లో కేవలం 5 లక్షల 6 వేల 265 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఓట్లు వేయడానికి విశాఖ నగర్ ప్రజలు ఆసక్తి చూపలేదు అని చెప్పడానికి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే విశాఖలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటం రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది.
ముఖ్యంగా ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళలో ఇంట్లో ఉన్న వృద్ధులు, పెద్దవాళ్లు అక్కడక్కడ యువత తప్ప మిగిలిన ప్రజలంతా జీవీఎంసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ముఖ్యంగా జన్ జీగా గర్వంగా చెప్పుకుంటున్న యువత జీవీఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపకపోవడం చర్చకు దారి తీసింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇచ్చిన సెలవు రోజుని ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడానికి వాడుకున్నట్లు కనిపిస్తుంది… సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్లో 50 శాతం ఓట్లు పోలేనట్లు తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో ఫైనల్ రిజల్ట్ రావాల్సి ఉంది.
2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 స్థానాలు గెలుచుకోగా టీడీపీ 30 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో విశాఖ నగర ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విశాఖ నగర పాలక పీఠం కోసం జరిగిన ఈ ఎన్నికలు అధికార కూటమికి, వైసీపీకి రాజకీయంగా కీలక పరీక్షగా నిలిచాయి. చిన్న చిన్న సంఘటన మినహా ఈవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. నవంబర్ 3న జరగనున్న ఓట్ల లెక్కింపుతో ప్రజాతీర్పు ఎవరు వైపు ఉంది అనేది వెళ్ళడు కానుంది.
Also Read: ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!