E-Paper
Advertisement

బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి లోకేష్.. రాప్తాడు దాడి బాధితురాలికి పరామర్శ

బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి లోకేష్.. రాప్తాడు దాడి బాధితురాలికి పరామర్శ
Advertisement

Nara Lokesh: రాప్తాడులో జరిగిన అమానుష దాడి ఘటన మనసును కలచివేస్తోంది. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం బెంగళూరు ఓల్డ్ హాల్ ఎయిర్ పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బెంగళూరుకు వెళ్లి ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు.

వైద్యులతో సుదీర్ఘ చర్చలు

Advertisement

ఆసుపత్రికి చేరుకున్న మంత్రి లోకేష్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న విద్యార్థినిని పరిశీలించారు. అనంతరం అక్కడి వైద్యులతో సుదీర్ఘంగా మాట్లాడి, పాపకు అందుతున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికకు అవసరమైన శస్త్రచికిత్సలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, రాబోయే 48 గంటలు చాలా కీలకమని చెప్పడంతో, చిన్నారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు. ‘మా సొంత బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించండి’ అని వైద్యులను కోరుతూ.. పాప ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రిన్సిపాల్‌తో మాట్లాడిన మంత్రి

Advertisement

అనంతరం బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన లోకేష్, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఘటన జరిగిన తీరుపై స్కూల్ ప్రిన్సిపాల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్‌తో పాటు ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.

ఉన్మాదిపై కఠిన చర్యలు

పాపపై ఇలాంటి రాక్షస దాడికి పాల్పడిన ఉన్మాదిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆ చిన్నారి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, చిరునవ్వుతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Also Read: ‘గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు..’ స్థానిక పోలింగ్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Tags

Related News

వైఎస్ జగన్ పై.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్!

‘గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు..’ స్థానిక పోలింగ్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో తయారైన తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ముంబైకి రవాణా!

తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను గండం.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!

మీడియా ముందు అదే తడబాటు.. దశాబ్దాల పులివెందుల కోటలో ప్రత్యర్థి జెండా?ఓటమిని జగన్ ఒప్పేసుకున్నారా?

ఎన్నికల్లో అరాచకాలు.. పులివెందులలో రీపొలింగ్‌కు జగన్ డిమాండ్, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం

పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు

Big Stories

Advertisement
×