E-Paper
Advertisement

DCCB UPI Services: సహకార బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. యూపీఐ సేవలు అందుబాటులోకి

DCCB UPI Services: సహకార బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. యూపీఐ సేవలు అందుబాటులోకి
Advertisement

DCCB UPI Services: సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (DCCB) తొలిసారిగా యూపీఐ సేవలు ప్రారంభించింది. సోమవారం నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యూపీఐ సేవలు వాణిజ్య బ్యాంకుల్లోని అకౌంట్లకు మాత్రమే అమల్లో ఉండేది.

ఆన్ లైన్ లావాదేవీలు ఈజీ

ఇకపై సహకార బ్యాంకుల్లోని అకౌంట్లకు యూపీఐ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రైతులకు ఇది ఉపయోగపడనుంది. పొగాకు, ఆయిల్‌పామ్, కోకో రైతుల లావాదేవీలు కమర్షియల్ బ్యాంకులలో ఎక్కువగా జరుగుతున్నాయి. సరకు విక్రయ లావాదేవీలు ఆన్ లైన్ లో జరుగుతుండడంతో.. ఆ సేవలు అందుబాటులో ఉన్న బ్యాంకుల్లోనే రైతులు లావాదేవీలు చేస్తు్న్నారు.

రైతులకు ప్రయోజనకరం

Advertisement

రైతులు ఎక్కువగా ఖాతాలు తీసుకునే సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో.. వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ప్రారంభించే విషయంపై ఆప్కాబ్‌ ఛైర్మన్‌ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. తొలుత ఈ సేవలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు.

Also Read: యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇంత నగదు మాత్రమే తీసుకోగలరట!

త్వరలోనే అన్ని బ్యాంకుల్లో

Advertisement

సహకార సంఘాలు, బ్యాంకులు లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నేతలు చెబుతున్నారు. ముందుగా ఖాతాల డేటాను కంప్యూటీకరించారని, అందుకే ఆన్‌లైన్‌ సేవలు అమలు చేయటానికి మార్గం ఏర్పడిదంటున్నారు. సహకార బ్యాంకుల అకౌంట్ల నుంచి మొబైల్‌ ఫోన్ల ద్వారా యూపీఐ తో డబ్బులు పంపించవచ్చని అధికారులు తెలిపారు. డిజిటల్ సేవలను ఎప్పుడు, ఎక్కడి నుంచైనా వినియోగించుకోవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిస్తోంది.

Related News

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

Big Stories

Advertisement
×